సెట్ లో బట్టలిప్పమని నటిని వేధించిన లేడీ ప్రొడ్యూసర్!

  • October 22, 2021 / 06:58 PM IST

ఓ లేడీ ప్రొడ్యూసర్ తనతో అసభ్యంగా ప్రవర్తించిందంటూ బిగ్ బాస్ ఫేమ్, టీవీ నటి ఉర్ఫి జావేద్ సంచలన కామెంట్స్ చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఓ వెబ్ సిరీస్ సెట్ లో ఎదుర్కొన్న చేదు సంఘటనను గుర్తు చేసుకున్నారు. బిగ్ బాస్ ఓటీటీలో పాల్గొన్న ఆమె ఇటీవల ఎలిమినేట్ అయి బయటకు వచ్చారు. ఈ క్రమంలో ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కెరీర్ ఆరంభంలో అవకాశాలు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డానంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

”మాది సంప్రదాయమైన మధ్యతరగతి కుటుంబం. నాకు నటి అవ్వాలనే ఆశ ఉండేది. కానీ ఫ్యామిలీలో ఆంక్షలు ఉండేవి. అక్కడే ఉంటే నటిని అవ్వనేమోనని బయటకు వచ్చేశాను. ఆ తరువాత చిన్న ఉద్యోగంలో చేరి నెలకు మూడు వేల రూపాయలకు పని చేసేదాన్ని. ఆర్థికంగా చాలా కష్టపడ్డాను. ఒక్కోసారి ఖాళీ కడుపుతో పడుకునేదాన్ని. సినిమా అవకాశాల కోసం చాలా మందిని కలిశాను. ఆఫర్ ఇచ్చినట్లే ఇచ్చి అక్కడకు వెళ్లేసరికి నో అనేవాళ్లు. అలా ఎన్నో సార్లు నిరాశకు గురయ్యాను” అంటూ చెప్పుకొచ్చింది.

అయితే ఓ వెబ్ సిరీస్ లో నటించే అవకాశం వచ్చిందని.. కథ నచ్చగానే ఓకే చెప్పి, కాంట్రాక్ట్ పేపర్లపై కూడా సంతకం చేసినట్లు తెలిపారు. మొదటిరోజు సెట్ కి వెళ్లగానే అక్కడ చేదు అనుభవం ఎదురైందని చెప్పుకొచ్చింది. ఆ వెబ్ సిరీస్ నిర్మాత ఓ మహిళ అని.. సెట్ లో అందరి ముందు ఆమె తనతో అసభ్యంగా ప్రవర్తించిందని చెప్పింది. షూటింగ్ మొదలవ్వగానే బట్టలు విప్పమని చెప్పిందని.. స్క్రిప్ట్ లో లేని ఇబ్బందికర సన్నివేశాన్ని తనపై చిత్రీకరించాలని చూసిందని తెలిపింది. దీంతో ఆ సీన్ లో నటించనని చెబితే.. బలవంతగా తన ఒంటిపై ఉన్న దుస్తులను చింపేసిందని.. ఎంత వేడుకున్నా వినలేదని వాపోయింది.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus