Siddharth: అప్పట్లో సిద్దార్థ్ కు అవమానాలు ఎదురయ్యాయా..?

ప్రభుదేవా దర్శకత్వంలో సిద్దార్థ్, త్రిష హీరోహీరోయిన్లుగా ఎమ్మెస్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా బ్లాక్ బస్టర్ హిట్ అనే సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకులలో ఒకరైన వీరుపోట్ల ఈ సినిమాకు కథ అందించారు. అయితే తాజాగా నిర్మాత ఎమ్మెస్ రాజు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సిద్దార్థ్ ను చూసి వీడు హీరో ఏమిటని అమ్మాయిలా ఉన్నాడని కామెంట్లు చేశారని ఎమ్మెస్ రాజు పేర్కొన్నారు.

తమ యూనిట్ లో సైతం చాలామంది హీరోగా సిద్దార్థ్ ను ఎంపిక చేయడంపై విమర్శలు చేశారని అయితే తాను మాత్రం విదేశాల నుండి ఇండియాకు వచ్చే యువకుడి పాత్రకు సిద్దార్థ్ సూట్ అవుతాడని బలంగా నమ్మానని చెప్పుకొచ్చారు. సిద్దార్థ్ జుట్టు గురించి కూడా కొంతమంది నుంచి నెగిటివ్ కామెంట్లు వచ్చాయని ఎమ్మెస్ రాజు వెల్లడించారు. రిలీజ్ పోస్టర్ విడుదలైన తరువాత కూడా సిద్దార్థ్ అమ్మాయిలా ఉన్నాడనే కామెంట్లు వినిపించాయని ఎమ్మెస్ రాజు తెలిపారు.

ప్రభుదేవాకు దర్శకత్వం చేసే అవకాశం ఇవ్వడంపై కూడా విమర్శలు వ్యక్తమయ్యాయని అప్పటికే తాను సక్సెస్ లో ఉండటంతో తనకు కళ్లు నెత్తికెక్కాయని కొంతమంది కామెంట్లు చేశారని ఎమ్మెస్ రాజు అన్నారు. అయితే నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా రిలీజైన తరువాత ఎన్నో కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. హిందీతో పాటు ఇతర భాషల్లో కూడా ఈ సినిమా రీమేక్ కావడంతో పాటు హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు పని చేసిన హీరో, హీరోయిన్, డైరెక్టర్, అందరూ టాప్ లెవెల్ కు వెళ్లిపోవడం గమానార్హం.


థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus