గీతాఆర్ట్స్ బ్యానర్ లో పని చేసిన బన్నీ వాసు ఆ తరువాత జీఏ2 పిక్చర్స్ బ్యానర్ ను స్థాపించి చిన్న బడ్జెట్ లో సినిమాలను నిర్మిస్తున్నారు. మొన్నామధ్య కార్తికేయ హీరోగా ‘చావు కబురు చల్లగా’ అనే సినిమాను నిర్మించారు. ఇది పెద్దగా వర్కవుట్ కాలేదు. దీంతో నష్టాలు వచ్చాయి. ఇప్పుడు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా తీశారు బన్నీ వాసు . ఈ సినిమా చాలా సార్లు రీషూట్ జరుపుకొని.. ఎన్నో సార్లు వాయిదా పడి ఫైనల్ గా మన ముందుకు రాబోతుంది.
అక్కినేని అఖిల్, పూజాహెగ్డే జంటగా నటించిన ఈ సినిమాకి సరైన బజ్ లేదు. పైగా గతంలో అఖిల్ చేసిన సినిమా ఏదీ కూడా సరిగ్గా ఆడలేదు. ఇది కాకుండా.. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ హిట్ ఇచ్చి చాలా ఏళ్లవుతుంది. ఈ మొత్తం టీమ్ లో క్రేజ్ ఉన్నవారు ఎవరైనా ఉన్నారంటే.. అది పూజాహెగ్డేనే. ఈ బ్యూటీకి యూత్ లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాస్ ఆడియన్స్ అయితే పూజా సినిమాలు ఎగబడి చూస్తుంటారు.
అందుకే నిర్మాత బన్నీ వాసు తన సినిమా ప్రచారానికి ఆమెని నమ్ముకున్నాడు. ఇప్పటికే పోస్టర్లలో ఆమె కాళ్లను హైలైట్ చేస్తూ హడావిడి చేస్తున్నారు. పూజాకి ఉన్న క్రేజ్, ఇటీవల వైరల్ అయిన సిద్ శ్రీరామ్ పాట సినిమాకి ఓపెనింగ్స్ తీసుకొస్తే చాలని అనుకుంటున్నారు నిర్మాత. గతంలో ‘చావు కబురు చల్లగా’ సినిమా ప్రమోషన్స్ లో అల్లు అర్జున్ సందడి చేసినా.. ఓపెనింగ్స్ రాలేదు. మరి ఈసారైనా బన్నీ వాసుకి సక్సెస్ వస్తుందేమో చూద్దాం!
Most Recommended Video
హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!