యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్నాడు.’బాహుబలి'(సిరీస్) తోనే అది సాధ్యం అయ్యింది అనడంలో సందేహం లేదు. అయితే అంతకు ముందు కూడా ప్రభాస్ స్టార్ హీరోనే..! కానీ బాహుబలి ప్రాజెక్టు మొదలవ్వడానికి ఏడాది ముందు ప్రభాస్ నుండీ ‘రెబల్’ మూవీ వచ్చింది. ఆ చిత్రం ప్లాప్ అయ్యింది. ఇక బాహుబలి చేసిన తరువాత ఎలాగు హిట్ వస్తుందని తెలిసినా.. అది పూర్తిగా రాజమౌళి అకౌంట్లోకే వెళ్ళిపోతుందని చాలా మంది కామెంట్లు చేసిన రోజులవి. ఆ టైంలో ‘మిర్చి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ప్రభాస్.నిజానికి ఈ చిత్రానికి మొదట ‘వారథి’ అనే టైటిల్ పెట్టారు. కానీ తరువాత మాస్ ను టార్గెట్ చేస్తూ ‘మిర్చి’ గా టైటిల్ ఫిక్స్ చేశారు.
ఇక 2013 ఫిబ్రవరి 8న ఈ చిత్రం విడుదలయ్యింది. అసలే సినిమాలకు డ్రై సీజన్.. పైగా కొత్త దర్శకుడు(కొరటాల శివ). పైగా సెన్సార్ బోర్డు వారు ఎ సెర్టిఫికెట్ ను జారీ చేశారు.దీంతో కనీసం కలెక్షన్లు వస్తాయని కూడా ఎవ్వరూ నమ్మకం పెట్టుకోలేదు. కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ.. ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపించింది. ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.48కోట్ల షేర్ ను రాబట్టింది. ప్రభాస్ స్క్రీన్ అప్పీరెన్స్ ఈ చిత్రంలో ఓ రేంజ్లో ఉంటుంది. ‘రెబల్’ తో డీలా పడిపోయిన ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలి తీర్చిన చిత్రమిది.అయితే ఇంతటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించే అవకాశం వస్తే ఓ నిర్మాత.. రిజెక్ట్ చేసాడట. ఎవరా నిర్మాత అనుకుంటున్నారా? మన ‘ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్’ అధినేత అనిల్ సుంకర.
ఆయన ఎందుకు ఈ ప్రాజెక్టుని రిజెక్ట్ చేసాడంటే.. ‘బిందాస్’ సినిమా వలన అని తెలుస్తుంది. ‘తన శత్రువుల వల్ల తన కుటుంబానికి అలాగే ఊరికి ప్రమాదం ఉందని.. ఆ గొడవలను ఎలాగైనా తగ్గించి తన ఊరు, కుటుంబం బాగుండాలి అని ఆరాట పడే ఓ పెద్ద. ఆ ఇంటి పెద్ద ఇంట్లో ఉండే హీరో వల్ల ఆ గొడవలు మరింత ఎక్కువ అవ్వడం. దీంతో హీరోని తన ఇంటి నుండీ ఆ ఊరి పెద్ద బయటకు నెట్టెయ్యడం… ఈ క్రమంలో ఆ గొడవలను ఆపడానికి శత్రువు ఇంటికే వెళ్ళి హీరో సెటిలయ్యి వారి మనసులు మార్చడం’ ఇదే బిందాస్ కథ. సరిగ్గా చూసుకుంటే ‘మిర్చి’ కథ కూడా అంతే.! ‘ఇదే లైన్ తో నా బ్యానర్ లోనే ఇలాంటి సినిమా చెయ్యడం కరెక్ట్ కాదు’ అని భావించి.. ‘ఈ ప్రాజెక్టుని నేను నిర్మించలేను’ అని అనిల్ సుంకర సైడ్ అయిపోయాడట. దాంతో ‘యూవీ క్రియేషన్స్’ వారు నిర్మాతలకు మారుతూ.. ఈ చిత్రాన్ని ప్రభాస్ తో నిర్మించారు. ఫలితంగా రెండింతల లాభాలను అందుకున్నారని తెలుస్తుంది.
Most Recommended Video
జాంబీ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా
శృతీ ఈ సినిమాలను రిజెక్ట్ చేసి మంచి పనే చేసిందా..?