యంగ్ హీరో సుధీర్ బాబు (Sudheer Babu) అందరికీ సుపరిచితమే. సూపర్ స్టార్ కృష్ణ (Krishna) అల్లుడిగా, మహేష్ బాబు (Mahesh Babu) బావమరిదిగా బాగా ఫేమస్. నాగచైతన్య (Naga Chaitanya) , సమంత (Samantha) .. జంటగా నటించిన ‘ఏ మాయ చేసావే’ (Ye Maaya Chesave) సినిమాలో సమంత అన్నయ్యగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ‘ఎస్.ఎం.ఎస్’ సినిమాతో హీరోగా మారాడు. ఇదే క్రమంలో ‘ప్రేమకథా చిత్రమ్’ తో (Prema Katha Chitram) మంచి సక్సెస్ అందుకున్నాడు. కానీ ఆ తర్వాత ఇతను కెరీర్ ను సరిగ్గా ప్లాన్ చేసుకోలేదు. వినూత్నమైన సినిమాలు చేస్తూ వచ్చాడు కానీ.. తన మార్కెట్ పెంచుకునే సినిమాలు ఇతను చేయలేదు.
అందువల్ల ఇప్పుడు సుధీర్ బాబు సినిమాకి హిట్ టాక్ వచ్చినా.. దానికి కోటి రూపాయల షేర్ కూడా రాని పరిస్థితి ఏర్పడింది. లేటెస్ట్ గా వచ్చిన ‘హరోం హర’ (Harom Hara) .. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. ఇదిలా ఉండగా.. సుధీర్ బాబు మార్కెట్ తెలిసి కూడా అతనితో పెద్ద దర్శకులు, నిర్మాతలు సినిమాలు చేయాలంటే ఆలోచిస్తారు. గతంలో ఇలాంటి సంఘటనే ఒకటి జరిగిందట. విషయంలోకి వెళితే…సుధీర్ బాబు – ఇంద్రగంటి మోహన్ కృష్ణ (Mohana Krishna Indraganti) కాంబినేషన్లో ‘సమ్మోహనం'(Sammohanam) అనే హిట్ సినిమా వచ్చింది.
దీనికి ‘శ్రీదేవి మూవీస్’ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ (Sivalenka Krishna Prasad) నిర్మాత. అయితే దీనిని నిర్మించే ఛాన్స్ మొదట ‘హరోం హర’ నిర్మాత సుబ్రహ్మణ్యంకి వచ్చిందట. ఇంద్రగంటి మోహన్ కృష్ణ ‘సమ్మోహనం’ కథ మొదట ఈయనకే కథ వినిపించి.. ‘సుధీర్ బాబుని హీరో అని ఫిక్స్ అయినట్లు సుబ్రహ్మణ్యంకి చెప్పారట. కానీ కొంతమంది స్నేహితులు.. ‘సుధీర్ బాబు హీరో అయితే చేయొద్దు. అతనికి మార్కెట్ లేదు’ అని సుబ్రహ్మణ్యంకి సలహా ఇచ్చారట.
దీంతో ఆయన ఆ సినిమా నిర్మించే ఛాన్స్ వద్దనుకుని తప్పుకున్నారు. అయితే ‘శ్రీదేవి మూవీస్’ సంస్థ ఈ చిత్రాన్ని అనుకున్న బడ్జెట్లో నిర్మించి లాభాలు అందుకుంది. ‘సమ్మోహనం’ సక్సెస్ అయ్యాక సుబ్రహ్మణ్యం చాలా ఫీలయ్యారట. ఇదే విషయాన్ని సుధీర్ బాబుకి ఆయన చెప్పారట. దీంతో సుధీర్ బాబు.. ‘మీరు హీరో మార్కెట్ ని బట్టి కాదు.. కథ ఎంతవరకు డిమాండ్ చేస్తుందో.. దానిని బట్టి బడ్జెట్ పెట్టాలి’ అంటూ సుబ్రహ్మణ్యంకి చెప్పాడట. కొన్నళ్ళ తర్వాత వీరి కాంబినేషన్లో ‘హరోం హర’ సెట్ అయినట్లు తెలుస్తుంది.