సినీ పరిశ్రమని వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. రోజు ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వింటూనే ఉన్నాం. తెలుగు సినిమా పరిశ్రమలోనే కాకుండా తమిళ, మలయాళ , కన్నడ సినిమా పరిశ్రమలో లేదా హిందీ, బెంగాలీ.. అది కూడా కాదు అంటే హాలీవుడ్ నుండి ఎవరొకరు మరణించినట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. దీంతో సినీ పరిశ్రమకు చెందిన వారిలో ఆందోళన నెలకొంటుంది. ఇక అసలు విషయానికి వెళ్తే.. సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది.
ప్రముఖ సీనియర్ నిర్మాత ఎస్ఏ రాజ్ కన్ను మంగళవారం నాడు గుండెపోటుతో మరణించారు. ‘అమ్మన్ క్రియేషన్స్’ బ్యానర్ ను స్థాపించి ఎన్నో సక్సెస్ ఫుల్ మూవీస్ ను ప్రేక్షకులకు అందించారు ఇతను. అందులో ఎక్కువగా మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు ఉండటంతో ఈయన పై ఓ ప్రత్యేకమైన గౌరవం అందరిలోనూ ఏర్పడింది.భారతీరాజాని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ రజినీ కాంత్,కమల్ హాసన్, శ్రీదేవిలతో ‘16 వయదినిలే’ అనే చిత్రాన్ని నిర్మించారు ఈయన.
ఆ సినిమా తెలుగులో ’16 ఏళ్ళ వయసు’ అనే టైటిల్ తో రీమేక్ అయ్యి ఇక్కడ కూడా ఘన విజయం సాధించింది. ఇంకా ఎంతో మంది స్టార్స్ ను పరిచయం చేసిన ఘనత కూడా రాజ్ కన్ను సొంతమని చెప్పాలి. దీంతో తమిళ సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కమల్ హాసన్, రాధిక, భారతీ రాజా.. వంటి వారు రాజ్ మృతికి చింతిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం వ్యక్తం చేశారు.ఇక రాజ్ కన్ను అంత్యక్రియలు బుధవారం నాడు నిర్వహించారు.