Jr NTR: ఎన్టీఆర్ పై ఆ నిర్మాత చేసిన కామెంట్స్ వైరల్..!

కమెడియన్ గా కెరీర్ ని ప్రారంభించి ఆ తర్వాత నిర్మాతగా మారి ఇండస్ట్రీ లో స్టార్ హీరోలందరితో సినిమాలను చేసిన ఘనత బండ్ల గణేష్ సొంతం. అంత చిన్న కమెడియన్ కి అకస్మాత్తుగా ఇంత ఆస్తులు ఎలా వచ్చాయని మీరంతా అనుకోవచ్చు. కానీ ఆయన సినిమా ఇండస్ట్రీ కి రాకముందే అతనికి పెద్ద కోళ్ల ఫామ్ ఉంది. తెలంగాణ ప్రాంతం లోనే ఆ ఫామ్ నెంబర్ 1. ఈయన ఫామ్ నుండి వచ్చిన గుడ్లనే అందరూ వాడుతారు, ఆ రేంజ్ వ్యాపారవేత్త కాబట్టే బండ్ల గణేష్ స్టార్ హీరోలతో సినిమాలను తీసే రేంజ్ కి ఎదిగాడు.

అయితే ఈయన తాను పని చేస్తున్న సినిమాలోని హీరో ని లేపడం లో ఎప్పుడూ ముందు ఉంటాడు. పవన్ కళ్యాణ్ కి భక్తుడు అని చెప్పుకొని తిరిగే బండ్ల గణేష్ , ఇతర హీరోలను కూడా సమానంగా అభిమానిస్తూ మాట్లాడడం మనమంతా చూసాము. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని మాత్రం ఒకసారి బండ్ల గణేష్ చాలా తీవ్రంగా విమర్శిస్తాడు. డబ్బులిస్తే కానీ డబ్బింగ్ చెప్పను అంటూ (Jr NTR) ఎన్టీఆర్ అన్నాడని,

రామ్ చరణ్ ని చూసి నేర్చుకో అంటూ ఒక ప్రముఖ టీవీ ఛానల్ లో బండ్ల గణేష్ మాట్లాడడం అప్పట్లో పెను దుమారమే రేపింది. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఇదే విషయాన్నీ బండ్ల గణేష్ ని అడగగా, అదేదో చిన్న మిస్ అండర్ స్టాండింగ్ వల్ల అలా అనాల్సి వచ్చింది. తర్వాత ఎన్టీఆర్ గారికి సమాధానం చెప్పాను, ఆయన అభిమానులకు కూడా సమాధానం చెప్పాను అంటూ చెప్పుకొచ్చాడు బండ్ల గణేష్.

అప్పుడు హీరోలను బుజ్జగించే మనస్తత్వం ఉన్న మీరు కూడా హీరోల మీద అలుగుతారా అని బండ్ల గణేష్ ని యాంకర్ అడగగా, ‘అలగాలి సార్..అలగకపోతే మనిషి ఎలా అవుతాను అని అంటాడు’ బండ్ల గణేష్. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus