సినిమా వాళ్లకు వచ్చే పరిశ్రమ పరమైన ఇబ్బందులు, సినిమా వాళ్ల మధ్య జరిగే ఇష్యూలను క్లియర్ చేయడానికి ఫిలిం ఛాంబర్ చాలా ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కొన్ని విషయాలు అక్కడ తేలితే.. మరికొన్ని విషయాలు తేలవు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఓ నిర్మాత ఛాంబర్ మెట్లు ఎక్కారు అని చెబుతున్నారు. ఓ చిన్న సినిమాగా మొదలైన దేశం మొత్తం విడుదలై భారీ విజయం అందుకుని పాన్ ఇండియా నిర్మాత అనిపించుకున్న నిర్మాతే (Producer) ఆయన. ఈ మేరకు టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
సినిమా వ్యాపార వ్యవహారాలు చిత్రంగా వుంటాయి. ఇద్దరు వ్యక్తుల మీద, రెండు సంస్థల మధ్య అగ్రిమెంట్‌లు ఉంటాయి. ఈ విషయంలో ఏదైనా ఇబ్బంది వస్తే.. చర్చలు, మీటింగ్‌లు, తీర్పులు, సయోధ్యలు లాంటివి ఉంటాయి. దీని కోసం ఛాంబర్‌కు వరుస ఫిర్యాదులు వస్తాయి. ఇలా వచ్చినవాటిలో సయోధ్యలే ఎక్కువగా ఉంటాయి అని అంటుంటారు. అయినా ఆ నిర్మాత కమ్ డిస్ట్రిబ్యూటర్ ఛాంబర్ ముందుకు వచ్చారట.
డిస్ట్రిబ్యూటర్లు వరుసగా సినిమాలు కొంటూ ఉంటారు, అన్ని సినిమాలూ విజయాలు సాధించవు. దీంతో కొనుక్కున్న వాళ్లు నష్టపోతారు. అగ్రిమెంట్ల ప్రకారం చూసుకుంటే వారికి పరిహారం ఉండదు. కానీ ఛాంబర్‌కి వస్తే వారికి పరిహారం రూపంలో న్యాయం జరుగుతుంది అని అంటుంటారు. ఇప్పుడు ఆ నిర్మాత కూడా ఇదే ఆలోచనతో వచ్చారు అని చెబుతున్నారు. అలా ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా పదికిపైగా ఫిర్యాదులు ఒకేసారి ఇచ్చారు అని చెబుతున్నారు.
అంటే 12 సినిమాల విషయంలో ఆయన ఇబ్బంది పడ్డారు అని అర్థమవుతోంది. మరి ఆ నిర్మాత (Producer ) ఎవరు? ఆ సినిమాలేంటి అనేది ఇక్కడ ఆసక్తికరంగా మారింది. ఒకట్రెండు సినిమాల విషయంలో రచ్చ అయితే ఓకే.. మొత్తంగా 10కిపైగా సినిమాలు అంటే మొత్తం పరిశ్రమలో చిన్నపాటి ముసలం అయితే పుడుతుంది అని చెబుతున్నారు.