Balakrishna: బడా నిర్మాతల ఆశల్ని అఖండ తీరుస్తాడా?

ఈ ఏడాది విడుదలై భారీ స్థాయిలో కలెక్షన్లు సాధించిన సినిమాల జాబితాలో వకీల్ సాబ్, ఉప్పెన, జాతిరత్నాలు, లవ్ స్టోరీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, క్రాక్ సినిమాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాలలో చాలా సినిమాలు బ్రేక్ ఈవెన్ అయినా నిర్మాతలకు భారీస్థాయిలో లాభాలను అందించడంలో ఫెయిల్ అయ్యాయి. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఒక్క తెలుగు సినిమా కూడా 50 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించలేదు. అయితే అఖండ సినిమాతో బాలయ్య బాక్సాఫీస్ ను షేక్ చేస్తాడని అభిమానులతో పాటు స్టార్ ప్రొడ్యూసర్లు సైతం భావిస్తున్నారు.

కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇప్పటివరకు చిన్న, మిడిల్ రేంజ్ హీరోల సినిమాలు రిలీజ్ కాగా అఖండ సినిమాతో భారీ సినిమాల విడుదల మొదలైంది. ఇప్పటికే రిలీజైన అఖండ ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. అఖండ మూవీ కలెక్షన్లపరంగా రికార్డులు క్రియేట్ చేస్తుందని అభిమానులు భావిస్తున్నారు. వైజాగ్ లో అఖండ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ త్వరలో జరగనుండగా అఖండ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తారని ఫ్యామిలీలు కూడా ఈ సినిమాకు క్యూ కడతాయని బడా నిర్మాతలు భావిస్తున్నారు.

అటు బాలయ్య, ఇటు బోయపాటి శ్రీను ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. అఖండ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని బాలయ్య వినయ విధేయ రామ సినిమాతో వచ్చిన నెగిటివ్ కామెంట్లకు ఈ సినిమాతో చెక్ పెడతానని బోయపాటి శ్రీను అనుకుంటున్నారు. అఖండ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరగగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. అఖండ స్టార్ ప్రొడ్యూసర్లకు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకునే స్థాయిలో సక్సెస్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus