నవ్వుతూనే అన్నారు గానీ… ఆలోచిస్తే ‘పాట’ సమస్యే పెద్దదే!

‘నాన్నకు ప్రేమతో’ (Nannaku Prematho) సినిమాలో ‘లవ్‌ దెబ్బ..’ పాట గుర్తుందా? ఇక ‘బ్రూస్‌లీ’ (Bruce Lee) సినిమాలోని ‘మెగా మీటర్‌..’ పాట గుర్తుందా? ఫైనల్‌గా ‘పుష్ప: ది రూల్‌’లో (Pushpa2) ‘పుష్ప పుష్ప పుష్ప’ పాట విన్నారా? ఈ మూడింటికి కామన్‌ పాయింట్ ఏంటో తెలుసా? ఆ మూడు పాటల్ని పాడిన గాయకుడు ఒక్కరే. అవును అప్పుడు దీపక్‌.. ఇప్పుడు దీపక్‌ బ్లూ అయి పాట పాడారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘పుష్ప: ది రూల్‌’ తెలుగు, తమిళ వెర్షన్‌లో ‘పుష్ప పుష్ప పుష్ప’ పాటను పాడింది దీపక్‌ బ్లూ. ఇప్పటికే తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో 300కిపైగా పాటలు పాడియన ఆయన.. మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన నవ్వుతూ కొన్ని మాటలు చెప్పారు కానీ.. అవి క్లీన్‌గా వింటుంటే చెప్పిన విషయాల కరెక్టేగా.. సిట్యువేషన్స్‌ అలానే ఉన్నాయి కదా అని అనకమానరు.

ప్రస్తుతం ఇండస్ట్రీలో గాయకుల మధ్య పోటీ పెరిగిందని, అదే సమయంలో పాటలు కూడా తగ్గిపోతున్నాయి అని కామెంట్‌ చేశారు దీపక్‌ బ్లూ. ఇదివరకు ఒక్కో సినిమాలో ఐదారు పాటలు ఉండేవని, ఒక్కో పాట ఐదు నిమిషాలు ఉండేది అని గుర్తు చేశారు దీపక్‌. కానీ ఇప్పుడు మూడు పాటలంటే ఎక్కువ అనేలా మారిందని వ్యాఖ్యానించారాయన. ఆ మూడు పాటల్లో ఒకటి సంగీత దర్శకుడు, మరొకటి హీరో పాడేస్తున్నారు.

మిగిలిన ఓ పాట కోసం మేం పోటీ పడుతుంటాం అని నవ్వేశారు దీపక్‌ బ్లూ. దీంతో ఆయన నవ్వేస్తూ అన్నారు కానీ.. సినిమాల్లో పాటల పరిస్థితి చూస్తుంటే అలానే ఉంది కదా అనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. అలా అని అన్ని సినిమాలు అలా లేవు. అలాగే అందరూ సంగీత దర్శకులు అలా చిన్న పాటలకు ట్యూన్స్‌ కట్టడం లేదు. ఇక అందరు హీరోలూ పాడటం లేదు. కానీ కొన్ని పెద్ద సినిమాల విషయంలో ఇలా జరుగుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus