సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. కొత్త ఏడాది ఆరంభంలోనే ‘హిట్ 3’ అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ మరణించారు. తర్వాత టాలీవుడ్ దర్శకురాలు అపర్ణ మల్లాది కూడా మరణించిన సంగతి తెలిసిందే.అలాగే సీనియర్ ఫిలిం జర్నలిస్ట్, నిర్మాత అయినటువంటి ప్రభు సతీమణి, అల్లు అర్జున్ పీఆర్ఓ, నటుడు అయినటువంటి ఏలూరు శ్రీను తల్లిగారు కూడా మరణించడం జరిగింది. అలాగే బాలీవుడ్ నిర్మాత, రచయిత ప్రీతిష్ నంది ఈరోజు చెందిన సంగతి తెలిసిందే.
ఈ షాక్..ల నుండి ఇంకా పరిశ్రమ కోలుకోకుండానే మరో సింగర్ కమ్ లిరిసిస్ట్ కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ గాయకుడు పి. జయచంద్రన్ మృతి చెందారు. ఆయన వయసు 80 ఏళ్ళు. వయోభారంతో పాటు పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆయన ఇటీవల త్రిశూర్ అమల ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూనే ఆయన కన్నుమూసినట్టు తెలుస్తుంది. కాలేయ సంబంధిత వ్యాధి ఆయన్ని ఏడాది పాటు హాస్పిటల్స్ చుట్టూ తిరిగేలా చేసింది అని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ఆయన మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు అని సినీ ప్రముఖులు భావిస్తున్నారు.మలయాళం రచయితే అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ‘సూర్యవంశం’ సినిమాలోని రోజావే చిన్ని రోజావే, ‘సుస్వాగతం’ సినిమాలోని ‘హ్యాపీ హ్యాపీ బర్త్డే లు’ ‘నువ్వేకావాలి’ సినిమాలోని ‘అనగనగా ఆకాశం ఉంది’ వంటి చార్ట్ బస్టర్ సాంగ్స్ ఈయన పాడినవే కావడం విశేషంగా చెప్పుకోవాలి. ఐదు దశాబ్దాలకు పైగా సినీ కెరీర్లో ఈయన అన్ని భాషలతోనూ కలుపుకుని వెయ్యికి పైగా పాటలు పాడారు.