Game Changer: ‘గేమ్ ఛేంజర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!

సంక్రాంతి సినిమాల హడావుడి మొదలు కాబోతుంది. ముఖ్యంగా ఈ సంక్రాంతికి వస్తున్న పెద్ద సినిమా ఏదంటే ‘గేమ్ ఛేంజర్’ అనే చెప్పాలి.మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఇందులో హీరో. మరికొన్ని గంటల్లో అంటే జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సినిమా. ‘గేమ్ ఛేంజర్’ ను థియేటర్లలో కచ్చితంగా చూడడానికి గల కారణాలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

Game Changer

1) కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్.. తాను దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన 31 ఏళ్ళ తర్వాత చేసిన తెలుగు సినిమా ఇది. ఆయన మొదటి సినిమా ‘జెంటిల్ మెన్’ నుండి టాలీవుడ్ కి చెందిన నిర్మాతలు ఆయన్ని తెలుగులో సినిమా చేయమని ఆహ్వానించారు, ఆఫర్లు ఇచ్చారు. ఒక దశలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు.. వంటి స్టార్లతో సినిమాలు ఫిక్స్ అనుకున్నారు. కానీ వర్కౌట్ కాలేదు. ఫైనల్ గా రాంచరణ్ ‘గేమ్ ఛేంజర్’ తో ఆయన టాలీవుడ్ డెబ్యూ ఇస్తున్నారు. సందేశాత్మక సినిమాలని వైవిధ్యంగా అలాగే గ్రాండ్ గా తెరకెక్కించడంలో శంకర్ దిట్ట. శంకర్ సినిమాకి ఎంత బడ్జెట్ పెట్టినా అది స్క్రీన్ పై కనిపిస్తుంది. ‘గేమ్ ఛేంజర్’ ను కూడా ఆయన లార్జ్ స్కేల్ లో రూపొందించారు. సో శంకర్ కోసం కచ్చితంగా ‘గేమ్ ఛేంజర్’ చూడాలి.

2) రామ్ చరణ్ : 2019 లో వచ్చిన ‘వినయ విధేయ రామ’ తర్వాత చరణ్ సోలో హీరోగా చేసిన సినిమా ఇదే.అంటే దాదాపు 5 ఏళ్ళ తర్వాత చరణ్ సోలో హీరోగా చేసిన సినిమా అనమాట.’ఆర్.ఆర్.ఆర్’ తో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయ్యాడు. ‘గేమ్ ఛేంజర్’ లో మూడు రకాల షేడ్స్ కలిగిన పాత్రలు చేశాడు. అతని కోసం కూడా కచ్చితంగా ఈ సినిమా చూడాల్సిందే.

3) టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కెరీర్లో 50 వ సినిమాగా ‘గేమ్ ఛేంజర్’ రూపొందింది. కాబట్టి ఈ సినిమాని ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని దిల్ రాజు నిర్మించడం జరిగింది. విజువల్స్ అన్నీ గ్రాండ్ గా ఉంటాయని ఇండస్ట్రీ టాక్.

4) పార్వతి పాత్ర పోషించిన అంజలి.. ఈ సినిమాలో నెవర్ బిఫోర్ అవతార్లో కనిపించబోతుంది. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా హైలెట్ అవుతుంది అని అంటున్నారు. సో ఆమె పాత్ర ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూద్దాం.

5) ‘సరిపోదా శనివారం’ సినిమాలో వన్ మెన్ షో చేసేశాడు ఎస్.జె.సూర్య. ‘గేమ్ ఛేంజర్’ లో అతని పాత్ర హీరోకి ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటుందట. చూద్దాం ఎలా ఉంటుందో.

6) దాదాపు 5 ఏళ్ళ తర్వాత కియారా అద్వానీ తెలుగులో చేసిన సినిమా ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమాలో ఆమె గ్లామర్ కూడా హైలెట్ అవుతుంది అంటున్నారు.

7) శ్రీకాంత్ రోల్ కూడా నెవర్ బిఫోర్ అనే విధంగా ఉంటుందట. ఈ సినిమాలో ఆయన బొబ్బిలి సత్యమూర్తి అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన లుక్ ఎంత వైవిధ్యంగా ఉందో టీజర్లో చూశాం.

8) ‘గేమ్ ఛేంజర్’ లో రామ్ చరణ్ ఇంట్రో సీక్వెన్స్ ఓ రేంజ్లో ఉంటుందట. హెలికాప్టర్ నుండి కత్తితో కిందికి వచ్చే సీన్ మాస్ కి ఫుల్ ఫీస్ట్ అంటున్నారు. అలాగే చరణ్ కలెక్టర్ గా మారిన తర్వాత ప్రభుత్వ కార్యాలయంలో వచ్చే ఫైట్ సీక్వెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందట.

9) ‘గేమ్ ఛేంజర్’ లో మరో హైలెట్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంటున్నారు. అప్పన్న పాత్రలో చరణ్ నటనకు అంతా ఫిదా అయిపోతారట. ఎమోషన్ కూడా బాగా వర్కౌట్ అయినట్లు తెలుస్తుంది. ఈ పాత్రకి గాను చరణ్ కి నేషనల్ అవార్డు రావడం గ్యారెంటీ అని ఎక్కువ మంది చెబుతున్నారు.

10) ఎస్.ఎస్.తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుందట. పాటలు కూడా సినిమా చూశాక.. మరింతగా ఎక్కుతాయి అంటున్నారు. శంకర్ వాటిని పిక్చరైజ్ చేసిన విధానం కూడా అందరినీ మెప్పిస్తుంది అంటున్నారు.

Game Changer First Review: శంకర్ మార్క్ పొలిటికల్ డ్రామా.. ఎలా ఉంది?

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus