Allu Arjun: స్టార్ హీరో బన్నీ లక్ష్యం ఏమిటంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంట్ తో స్టార్ హీరో స్టేటస్ ను సొంతం చేసుకున్న అల్లు అర్జున్ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోలలో ఒకరనే సంగతి తెలిసిందే. అల వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్ సాధించిన అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాలో నటిస్తున్నారు. వైవిధ్యం ఉన్న కథలకు ప్రాధాన్యతనిచ్చే బన్నీ ఐకాన్ సినిమాలో అంధుని పాత్రలో నటించనున్నారని ప్రచారం జరుగుతుండటం గమనార్హం. ప్రముఖ టాలీవుడ్ రచయితలలో ఒకరైన బీవీఎస్ రవి ఒక ఇంటర్వ్యూలో బన్నీ గురించి మాట్లాడుతూ బన్నీ గురించి ఎవరికీ తెలియని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

అల్లు అర్జున్ ప్రతిసారి యూనిక్ నెస్ కోసం ప్రయత్నిస్తారని డ్యాన్సుల్లో సైతం బన్నీ తన ప్రత్యేకతను చూపిస్తారని బీవీఎస్ రవి చెప్పుకొచ్చారు. సినిమాల కొరకు బన్నీ అదనంగా హార్డ్ వర్క్ చేస్తారని బీవీఎస్ రవి పేర్కొన్నారు. బన్నీని ఒక సందర్భంలో తన లక్ష్యం గురించి అడగగా నంబర్ 1 హీరో కావడం తన లక్ష్యమని చెప్పారని బీవీఎస్ రవి అన్నారు. లక్ష్యాన్ని సాధించే వరకు చంచలత్వం చూపించకపోవడం, పనిని అంకిత భావంతో చేయడం బన్నీ సక్సెస్ కు కారణాలని బీవీఎస్ రవి వెల్లడించారు.

సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పుష్ప సినిమా కోసం బన్నీ తన లుక్ ను పూర్తిగా మార్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బన్నీ మరో ఇండస్ట్రీ హిట్ ను ఖాతాలో వేసుకుంటారని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం. ఐకాన్ సినిమాలో బన్నీకి జోడీగా ఎవరు నటిస్తారో తెలియాల్సి ఉంది.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus