Chiranjeevi: వెండితెర పై తిరుగులేని రారాజు.. రాబోయే తరాలకు స్ఫూర్తి మెగాస్టార్..!

ఈరోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఆయన 67 వ పుట్టినరోజు వేడుకలు.. మెగా ఫ్యామిలీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అభిమానులు కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. మెగాస్టార్ ఇండస్ట్రీలో అందరివాడిగా, తిరుగులేని రారాజుగా 4 దశాబ్దాలుగా వెలుగొందుతున్నారు. చాలా మంది స్టార్లు మెగాస్టార్ గొప్పతనాన్ని పలు సందర్భాల్లో తమ శైలిలో వివరించారు. ఆ సెలబ్రిటీలు ఎవరు, చిరంజీవి గురించి గొప్పగా ఏం కోట్స్ చెప్పారో ఓ లుక్కేద్దాం రండి :

1) రజినీకాంత్, కమల్ హాసన్ , శివాజీ గణేశన్ వంటి వారిని కలిపితే మెగాస్టార్ చిరంజీవిలా అనిపిస్తూ ఉంటారు. కానీ చిరంజీవికి ఓ ప్రత్యేకత సంతరించుకుంటుంది. -కె.బాలచందర్

2) ‘ఆపద్బాంధవుడు’ లో హాస్పిటల్ సీన్ ఉంటుంది. అందులో మెగాస్టార్ చిరంజీవి నటన రాబోయే హీరోలకి ఒక టెక్స్ట్ బుక్ లాంటిది. ఆ సీన్ నుండి వారు ఎంతో నేర్చుకోవచ్చు. – కె. విశ్వనాథ్

3) చాలా మంది హీరోలు చిరంజీవిని, ఆయన స్టైల్ ని ఇమిటేట్ చేయాలని చూస్తుంటారు. కానీ చిరంజీవి చిరంజీవే..! అలాంటి లెజెండ్ జీవితంలో ఒక్కసారే వస్తాడు. – కోటా శ్రీనివాసరావు

4) డ్యాన్స్ ను ఎంజాయ్ చేస్తూ చేయడం చిరంజీవి గారికి మాత్రమే సాధ్యం. ఇండస్ట్రీకి వచ్చే ప్రతీ డైరెక్టర్ చిరంజీవి గారిని ఒక్క ఫ్రేమ్ లో అయినా డైరెక్ట్ చేయాలి అని కోరుకుంటారు.నేను అందుకు అతీతం కాదు

ఆయనకు ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవడం నచ్చదు. ఆయనకు ఇండస్ట్రీ బిడ్డగానే ఉండడం ఇష్టం. కానీ నా దృష్టిలో మాత్రం ఆయన ఇండస్ట్రీ పెద్దే..! – రాజమౌళి

5) ఒక రకంగా చూస్తే లేడి కళ్లల్లో గ్రేసు.. మరో రకంగా చూస్తే పులి కళ్లలోని రౌద్రం కనిపిస్తున్నాయి. – బాపు

6) నేను ఎక్కడికి వెళ్లినా.. మీ ఫేవరెట్ డాన్సర్ ఎవరు అని అడుగుతుంటారు.! నా ఫేవరెట్ డాన్సర్ చిరంజీవి గారే . నేను ఆయనలా అయితే డాన్స్ చేయలేను. – ప్రభుదేవా

7) ఇండియన్ సినిమాకు ఆయన నిజమైన రారాజు – అమితాబ్

8) నేను చిరంజీవి గారికి పెద్ద అభిమానిని – ఆమిర్ ఖాన్

9) చిరంజీవి సార్ ఓ లెజెండ్ – ప్రభాస్

10) చిరంజీవి గారు నాకు స్ఫూర్తి. ఆయన స్థానాన్ని ఎవ్వరూ రీ ప్లేస్ చేయలేరు. – మహేష్ బాబు

11) ఇండియన్ సినిమా ఫేట్ ను మార్చిన ఘనత చిరంజీవి సొంతం – IBN LIVE

12) ఎవరు ఎంత కష్టపడినా చిరంజీవి కాలేరు, ఆయన స్థాయిని అందుకోవడం అనేది పగటికల లాంటిదే..! – అక్కినేని నాగార్జున

13) నాకు పర్సనల్ గా ఓ హిస్టరీ ఉంది. ఆ హిస్టరీ పేరు మెగాస్టార్ చిరంజీవి. ఆయన ఎండలో కష్టపడితే.. ఆయన నీడ నుంచి పైకొచ్చాం. ఈరోజు మేమెంత పైకొచ్చినా ఆయన నీడ నుండి రావడం వల్లనే మీ అభిమానం పొందాం. నాకు ఆయన తర్వాతే ఇంకెవరైనా..! – అల్లు అర్జున్

14) చిరంజీవి గారు నాకు ఇన్స్పిరేషన్. నాకు మాత్రమే కాదు నెక్స్ట్ జనరేషన్ ఫిలిం మేకర్స్ అందరికీ ఆయనే ఇన్స్పిరేషన్. మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చినా కష్టపడితే గొప్పవాళ్ళం అవ్వొచ్చు అని చాటి చెప్పారాయన.! తెలుగు సినిమా పవర్ ఏంటో ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి చిరంజీవి గారు. – త్రివిక్రమ్ శ్రీనివాస్

15) మీరు(చిరంజీవి) చరణ్ కు ఫాదర్ అయ్యుండొచ్చు.. కానీ హీరో అవుదామనుకుని ఇండస్ట్రీలో అడుగుపెట్టే నాలాంటి వాళ్ళెంతోమందికి మీరు గాడ్ ఫాదర్. – కార్తికేయ గుమ్మకొండ

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus