మ్యూజియంలో మైనపు ప్రతిమగా మన సినీ స్టార్స్

మైనపు ప్రతిమలకు ప్రసిద్ధి చెందిన మేడమ్ టుస్సాడ్స్ వారి ప్రధాన మ్యూజియం లండన్ లో ఉంది. ఇందులో ప్రఖ్యాతగాంచిన ప్రముఖుల మైనపు ప్రతిమలను ప్రతిష్టిస్తుంటారు. ఇవి పర్యాటకులకు మంచి సందర్శన కేంద్రంగా మారింది. మేడమ్ టుస్సాడ్స్ తమ శాఖలను విస్తరిస్తున్నారు. న్యూ యార్క్ , హాంగ్ కాంగ్, బ్యాంకాక్, వాషింగ్టన్, సింగపూర్ లో ప్రారంభించారు. ఢిల్లీ లోను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మైనపు విగ్రహాన్ని కలిగిన భారతీయ సినీ స్టార్స్ పై ఫోకస్..

అమితాబ్ బచ్చన్ బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మైనపు విగ్రహం మేడమ్ టుస్సాడ్స్ కు చెందిన లండన్, న్యూ యార్క్ , హాంగ్ కాంగ్, బ్యాంకాక్, వాషింగ్టన్, సింగపూర్, ఢిల్లీ లలోని మ్యూజియంలలో ప్రతిష్టించారు.

ప్రభాస్ బాహుబలితో ప్రభాస్ అందరి హీరో అయిపోయారు. అందుకే బ్యాంకాక్ లోని మ్యూజియంలో అమరేంద్ర బాహుబలి పాత్రలోని ప్రభాస్ ప్రతిమని ఏర్పాటు చేశారు.

సల్మాన్ ఖాన్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మైనపు ప్రతిమను మేడమ్ టుస్సాడ్స్ కు చెందిన లండన్, న్యూ యార్క్ , ఢిల్లీ లలోని మ్యూజియంలలో ఏర్పాటు చేశారు.

షారూఖ్ ఖాన్ బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ మైనపు ప్రతిమను లండన్, సింగపూర్ లలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలలో మనం చూడవచ్చు.

ఆషా భోంస్లే ప్రఖ్యాత సినీ గాయని ఆషా భోంస్లే విగ్రహాన్ని మేడమ్ టుస్సాడ్స్ ఢిల్లీ మ్యూజియంలో ఏర్పాటు చేశారు.

మాధురి దీక్షిత్ నృత్య మయూరి మాధురి దీక్షిత్ ప్రతిమని మేడమ్ టుస్సాడ్స్ ప్రధాన మ్యూజియం లండన్ లో ఏర్పాటు చేశారు.

అనిల్ కపూర్ బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ నటించిన స్లమ్ డాగ్ మిలియనీర్ లోని రోల్ ప్రతిమను సింగపూర్, ఢిల్లీ లలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటుచేశారు.

ఐశ్వర్యారాయ్ అందాల సుందరి ఐశ్వర్యారాయ్ కి ప్రపంచమంతా అభిమానులు ఉన్నారు. అందుకే ఆమె మైనపు ప్రతిమను మేడమ్ టుస్సాడ్స్ వారు లండన్, న్యూ యార్క్ లలో ప్రతిష్టించారు.

హృతిక్ రోషన్ బాలీవుడ్ సూపర్ డ్యాన్సర్ హృతిక్ రోషన్ మైనపు ప్రతిమను మేడమ్ టుస్సాడ్స్ వారు లండన్, ఢిల్లీలలో ప్రతిష్టించారు.

కరీనా కపూర్ బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ప్రతిమను సింగపూర్, ఢిల్లీ లలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటుచేశారు.

కత్రినా కైఫ్అందంగానే కత్తి తో యువకుల హృదయాలను కోసే కత్రినా కైఫ్ విగ్రహాలను లండన్, ఢిల్లీ లలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటుచేశారు.

రణవీర్ కపూర్ బాలీవుడ్ యువ హీరో రణవీర్ కపూర్ విగ్రహాన్ని ఢిల్లీ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రీసెంట్ గా ఆవిష్కరించారు.

మధుబాల నాటి హీరోయిన్ మధుబాల ప్రతిమను ఢిల్లీ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు.

శ్రేయ ఘోషాల్స్వీట్ గాయని శ్రేయ ఘోషాల్ విగ్రహాన్ని మేడమ్ టుస్సాడ్స్ ఢిల్లీ మ్యూజియంలో ఏర్పాటు చేశారు.

సోను నిగమ్ ఉత్సాహవంతంగా పాడే గాయకుడు సోను నిగమ్ ప్రతిమ మేడమ్ టుస్సాడ్స్ ఢిల్లీ మ్యూజియంలో ప్రతిష్టించారు.

కపిల్ శర్మ కమెడియన్ కపిల్ శర్మ ప్రతిమ కూడా ఢిల్లీ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ఉంది.

వరుణ్ ధావన్ యువ హీరో వరుణ్ ధావన్ విగ్రహాన్ని ప్రస్తుతం సిద్ధం చేస్తున్నారు. దీనిని మేడమ్ టుస్సాడ్స్ హాంకాంగ్ మ్యూజియంలో త్వరలో ఏర్పాటు చేయనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus