సాధారణంగా సినిమాల్లో ఒకటి, రెండు పాత్రలు కీలకంగా ఉంటాయి. అందుకోసం నటీనటులు వేషం, భాష, నడవడిక అన్ని మార్చుకొని పాత్రలో పరకాయప్రవేశం చేస్తారు. అలా కష్టపడిన వారికి గుర్తింపు రావడం సహజం. అయితే రాజమౌళి సృష్టించిన బాహుబలి లో ఒకటి కాదు, రెండు కాదు అనేక పాత్రలు కీలకంగా మారాయి. ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన స్థానం ఇచ్చారు జక్కన్న. అందుకే ఆ క్యారెక్టర్స్ మంచి గుర్తింపును పొందాయి. రాజుల కాలం నాటి కథలోకి వెళ్ళడానికి నేటి నటీనటులు ఎలా తమను మార్చుకున్నారనే దానిపై ఫోకస్…
సత్యరాజ్తమిళంలో ప్రముఖ హీరో సత్యరాజ్. అయన కథానాయకుడిగా నటించిన ఎన్నో చిత్రాలు వందరోజులు ఆడాయి. అటువంటి వ్యక్తి మాహిష్మతి రాజ్యానికి కట్టుబానిసగా నటించారు. మాట మీద నిలబడే వంశంలో పుట్టిన వీరుడిగా, గుండుతో.. నెరిసిన మీసంతో కనిపించారు. ఈ లుక్ లో సత్యరాజ్ ఇదివరకు కనిపించలేదు. అందుకే ఏ చిత్రానికి రాని గుర్తింపు కట్టప్ప పాత్రతో ఆయన సొంతం చేసుకున్నారు.
రానాప్రజలకు సేవ చేసే నాయకుడిగా దగ్గుబాటి రానా లీడర్ సినిమా ద్వారా పరిచయమయ్యారు. ఆరడుగుల అందగాడు హీరోగా నటించిన సినిమాల్లో స్లిమ్ గా ఆకట్టుకున్నాడు. అతన్ని బాహుబలి పరమ దుర్మార్గుడిగా మార్చేసింది. అందుకు తగ్గట్టు బాడీని భారీగా పెంచి, జిమ్ నే రెండో ఇల్లుగా చేసుకొని బలవంతమైన క్రూరుడు భల్లలాదేవాగా రానా మారిపోయారు.
ప్రభాస్అమ్మాయిల గుండెల్లో గిలిగింతలు పెట్టే సుందరాంగుడు ప్రభాస్. లవర్ బాయ్ పాత్రల్లో చాలా సరదాగా కనిపించే ప్రభాస్ ని బాహుబలి మహారాజుని, యువరాజుని చేసింది. ఆ రాజా ఠీవి కోసం బాడీని పెంచడమే కాదు.. కత్తి తిప్పడం, గుర్రపు స్వారీ వంటివి నేర్చుకొని అలనాటి రాజులను ప్రభాస్ కళ్లకు కట్టారు. ప్రపంచం మొత్తం తన కటవుట్ ని ఇప్పటికీ, ఎప్పటికీ గుర్తించుకునేలా చేశారు.
తమన్నామిల్కీ బ్యూటీ తమన్నా.. హ్యాండ్ బ్యాగ్ మోసిన చేతులు కందిపోయేటట్టు ఉంటుంది. అటువంటి అమ్మాయి కత్తి పట్టి శత్రువులను చీల్చి చెండాలి. అసలు ఆ పాత్ర ఈమె చేయగలదా? అని డవుట్ ఎవరికైనా వస్తుంది.. ఆ అనుమానాలను తమన్నా తన నటన, యాక్షన్ తో పోగొట్టింది. అవంతికగా మారిపోయి ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకుంది.
అనుష్కటాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అనుష్క. ఆమె కను సైగ చేసినా, కన్ను ఎర్ర చేసినా సినిమా హిట్టే. ఆమె అందాలను చూడడానికి అబ్బాయిలు, ఆమె డ్రస్ సెన్స్ తెలుసుకోవడానికి అమ్మాయిలు అనుష్క నటించిన సినిమాలకి వెళ్తుంటారు. బాహుబలి లో ఈ రెండు లేదు. అయినా ఫిదా అయిపోయారు. ఒకే ఒక చీర.. మాసిపోయిన జుట్టు, వాడిపోయిన మొహం.. ఇతడి డీ గ్లామర్ రోల్ ల్లోనూ అద్భుతంగా నటించి అద్భుత నటి అని మరో మారు నిరూపించుకుంది.
రమ్యకృష్ణరాజమాత ఎలా ఉండాలి. నడకలో రాజసం, కళ్ళల్లో దైర్యం, మాటలో గాంభీర్యం.. చీరకట్టు, బొట్టు.. ఇలా ప్రతి లక్షణాన్ని తన బాడీలోకి ఇంజెక్ట్ చేసుకున్నట్టగా శివగామి పాత్ర కోసం రమ్యకృష్ణ మారిపోయారు. ఆమె నడిచి వస్తుంటే కుర్చీలో కూర్చున్న రాజు అయినా లేచి నిలబడే విధంగా జీవించారు.
నాజర్దక్షిణాది ఉత్తమనటుల్లో నాజర్ ఒకరు. ఏ క్యారక్టర్ ని అయినా అవలీలగా పోషిస్తారు. అటువంటిది బిజ్జల దేవా పాత్ర కోసం అవిటి వాడిగా, బుర్ర నిండా చెడు ఆలోచనలు కలిగిన వ్యక్తిగా.. కళ్ళల్లో విషాన్ని కురిపించారు. ఆహార్యం తో పాటు ప్రత్యేక మేనరిజం, డైలాగ్ మాడ్యులేషన్ తో మెప్పించారు.
ప్రభాకర్బాహుబలిలో పేరు చెప్పకపోతే గుర్తుపట్టలేని పాత్ర పోషించిన నటుడు ప్రభాకర్. కాలకేయగా కొన్ని నిముషాల పాటు మాత్రమే కనిపించినా నల్లని శరీరం, మొహం నిండా గాట్లు, గార పట్టిన పళ్లు.. చెబుతుంటేనే అసహ్యించుకునే విధంగా ఉండే ఆ క్యారక్టర్ చనిపోయినా, తన అంకిత భావంతో సజీవంగా నిలిపాడు.
సుదీప్కన్నడ స్టార్ హీరో సుదేవ్ బాహుబలిలో చిన్న రోల్ పోషించినప్పటికీ తన నటనతో గుర్తింపు పొందారు. వేషం మార్చి, కత్తి పట్టి కట్టప్పతో పోటీ పడి.. ప్రేక్షకుల దృష్టిలో పడ్డారు.