శ్రీకాకుళం తుఫానుపై స్పందించని స్టార్ హీరోలు

కేరళలో భారీ వరదల కారణంగా కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగి, వేలాదిమంది రోడ్డు మీద పడ్డప్పుడు భాషా బేధం లేకుండా అన్ని రాష్ట్రాల ప్రజలు, నాయకులు, నటీనటులు ముందుకొచ్చి కోట్ల రూపాయల ఆర్ధిక సహాయంతోపాటు మానసిక స్థైర్యాన్ని నింపారు. ఇప్పుడు ఇంచుమించు అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళంలోనూ భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ వ్యవహారం జరిగి వారం కావస్తోంది. కానీ.. ఇప్పటివరకూ ప్రభుత్వం తరపునుంచే కాదు ఇండస్ట్రీలోని టాప్ హీరోల నుంచి కూడా ఎలాంటి సహాయం ప్రకటించబడలేదు.

ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, వరుణ్ తేజ్, కళ్యాణ్ రామ్ లాంటి యంగ్ స్టార్ హీరోస్ తప్ప అగ్ర కథానాయకులు కానీ.. మీడియం రేంజ్ హీరోలు కానీ ఇప్పటివరకూ ఎలాంటి విరాళాలూ ప్రకటించలేదు. పక్క రాష్ట్రంలో సమస్య వచ్చిందంటే ఇమ్మీడియట్ గా సహాయం ప్రకటించిన మన స్టార్ హీరోలందరూ మన తెలుగు రాష్ట్రానికి కష్టం వచ్చినప్పుడు మాత్రం సైలెంట్ గా ఉండడం ఆశ్చర్యకరం. మరి వాళ్ళందరూ ఎప్పటికీ మేల్కోంటారో? ఎప్పడు సహాయం ప్రకటిస్తారో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus