Nidhi Agarwal : తెలుగు డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా 2018 లో తెరకెక్కిన చిత్రం ‘సవ్యసాచి’. ఈ చిత్రం ద్వారా తెలుగు సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన భామ నిధి అగర్వాల్. ఆ తరువాత ఈ హీరోయిన్ నటించిన మిస్టర్ మజ్ను, హీరో చిత్రాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే పూరి జగన్నాధ్ డైరెక్షన్లో రామ్ పోతినేని హీరోగా రూపొందిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీ తో హిట్ అందుకుంది ఈ భామ.
రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ మూవీ లో హీరోయిన్ గా నటించినా కూడా ఆ చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడటంతో నిధి అగర్వాల్ ఆశలన్నీ, ప్రస్తుతం 2026 సంక్రాంతి రిలీజ్ కు రెడీ అయిన రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘రాజాసాబ్’ మూవీపైనే పెట్టుకుంది. రాజాసాబ్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ నిధి నిన్న kphb లోని లులు మాల్ లో సందడి చేసారు. సెకండ్ సింగల్ రిలీజ్ కి హీరోయిన్స్ రాగా అక్కడ అభిమానుల ఓవర్ ఫ్లో జరగింది.
చివరికి పరిస్థితి ఎలా అయ్యిందంటే.. హీరోయిన్ బాడీగార్డ్స్ సహాయంతో కార్ వరకు వెళ్ళటమే చాలా ఇబ్బందిగా మారింది. అలానే ఇబ్బంది పడుతూ అభిమానుల తాకిడిలోనే కార్ లోకి చేరుకున్నారు. ఇదంతా చూసి నిధి అగర్వాల్ తీవ్ర అసౌకర్యానికి గురైంది.