స్టార్ డం సంపాదించుకున్న నటీనటులు కోట్లల్లో పారితోషికాలు అందుకుంటూ ఉంటారు.ఇది ఈ రోజుల్లో చాలా కామన్ పాయింట్. వారి ఇమేజ్ తో సినిమాకి కొంత మార్కెట్ ఏర్పడుతుంది. వారి మార్కెట్ కు తగ్గట్టు స్టార్లు డిమాండ్ చేసిన మేరకు పారితోషికాలు ఇస్తుంటారు నిర్మాతలు. అయితే మొదటి సినిమాకి ఆ స్టార్ల పారితోషికానికి, ఇప్పటి పారితోషికానికి అస్సలు పొంతన ఉండదు. కొంతమంది మొదటి స్టార్లు తీసుకున్న పారితోషికం చాలా మందిని షాక్ గురి చేయడం ఖాయం. ఇప్పుడు అలాంటి స్టార్ల మొదటి సినిమాల పారితోషికాల గురించి తెలుసుకుందాం రండి :
1) మెగాస్టార్ చిరంజీవి :
చిరంజీవి నటించిన మొదటి సినిమా ‘పునాది రాళ్ళు’ 1978 లో వచ్చింది. ఈ సినిమాకి రాజ్ కుమార్ దర్శకుడు. ఈ సినిమాకు గాను చిరంజీవి అందుకున్న పారితోషికం కేవలం రూ.1116(వెయ్యి నూట పదహార్లు). ఇప్పుడు ఆయన ఒక్కో సినిమాకు రూ.60 కోట్లు పారితోషికం అందుకుంటున్నారు
2) కమల్ హాసన్ :
చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగ ప్రవేశం చేసిన కమల్ హాసన్.. తన మొదటి సినిమా ‘కలతూర్ కన్నమ్మ’ చిత్రానికి రూ.500 పారితోషికం అందుకున్నారు. ఇప్పుడు ఆయన ఒక్కో సినిమాకు రూ.30 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నారు.
3) దీపికా పదుకోనె :
ఈమె మొదటి సినిమాకు పారితోషికం లేదు. ఇది నిజం. ఈమె డెబ్యూ మూవీ ‘ఓం శాంతి ఓం’ చిత్రానికి ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదు. ఇప్పుడు ఆమె రూ.10 కోట్ల నుండి రూ.15 కోట్ల వరకు పారితోషికం అందుకుంటుంది.
4) అమితాబ్ బచ్చన్ :
1969లో వచ్చిన సాత్ హిందుస్తానీ చిత్రం అమితాబ్ కు మొదటి సినిమా. ఈ సినిమా కోసం ఈయన అందుకున్న పారితోషికం కేవలం రూ.5000 మాత్రమే. ఇప్పటికీ ఆయన రూ.10 కోట్లకు పైగా పారితోషికం అందుకుంటున్నారు.
5) మోహన్ లాల్ :
మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ తన మొదటి సినిమా ‘మంజిల్ విరింజల్ పొక్కల్’ కు రూ.2000 పారితోషికం తీసుకున్నారు. ఇప్పుడు ఒక్కో సినిమాకి ఆయన రూ.60 కోట్లు పారితోషికం అందుకుంటున్నారు.
6) అజిత్ :
‘పాసమలార్గల్’ అనే చిత్రంలో ఈయన ఒక్క నిమిషం పాత్ర పోషించారు. దీని కోసం ఆయన రూ.2500 అందుకున్నారు.ఇప్పుడు అతను ఒక్కో సినిమాకు రూ.70 కోట్ల వరకు అందుకుంటున్నాడు.
7) ఆమిర్ ఖాన్ :
తన మొదటి చిత్రం ‘కయామత్ సే కయామత్ తక్’ కోసం రూ.11000 పారితోషికం అందుకున్నారు. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.80 కోట్ల నుండి రూ.100 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నాడు.
8) విజయ్ :
చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన మొదటి సినిమా ‘వెట్రి’ కోసం ఇతను రూ.500 అందుకున్నాడు. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.100 కోట్లు అందుకుంటున్నాడు.
9) అక్షయ్ కుమార్ :
మొదటి సినిమా ‘సౌగంధ్’ కోసం ఇతను రూ.51000 పారితోషికం అందుకున్నాడట. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.60 కోట్లు పారితోషికం అందుకుంటున్నాడు.
10) ఎన్టీఆర్ :
ఇతని మొదటి చిత్రం ‘నిన్ను చూడాలని’ కోసం ఇతను రూ.4 లక్షలు పారితోషికం అందుకున్నాడట. ఇప్పుడు ఒక్కో సినిమాకి రూ.60 కోట్లు పారితోషికం అందుకుంటున్నాడు.