అనుష్క కష్టం పగోడికి కూడా రాకూడదంటున్న ఫ్యాన్స్..?

సూపర్ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టిన అనుష్క తొలి సినిమాతోనే మంచి హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకుంది. ఆ సినిమా తరువాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించిన అనుష్క స్టార్ హీరోల సినిమాలతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకుంది. అరుంధతి సినిమాతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో సైతం కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించే ప్రతిభ తన సొంతమని అనుష్క ప్రూవ్ చేసింది. అయితే కెరీర్ లో అనుష్క చేసిన ఒకే ఒక తప్పు ఆమెకు అవకాశాలు తగ్గడంతో పాటు కొత్త సమస్యలకు కారణమవుతోంది.

అనుష్క ప్రధాన పాత్రలో నటించిన సైజ్ జీరో సినిమా 2015 సంవత్సరం నవంబర్ 27వ తేదీన విడుదలై బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలోని పాత్ర కోసం బరువు పెరిగిన అనుష్క తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా పూర్వపు స్థితికి చేరుకోలేకపోయారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రారా కృష్ణయ్య ఫేమ్ మహేష్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అనుష్క ప్రస్తుతం బరువు తగ్గే పనిలో బిజీగా ఉన్నారని సమాచారం. ఏప్రిల్ లేదా మే నెల నుంచి అనుష్క కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.

ఏప్రిల్ లోపు అనుష్క బరువు తగ్గి సన్నగా కనిపిస్తారేమో చూడాల్సి ఉంది. మరోవైపు అనుష్కకు గతంతో పోలిస్తే ఆఫర్లు తగ్గాయి. ఈ మధ్య కాలంలో అనుష్క నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడం ఆమె కెరీర్ కు మైనస్ గా మారింది. అనుష్క బరువు కష్టాలు పగోడికి కూడా రాకూడదని ఆమె ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. బరువు పెరగకపోయి ఉంటే కాజల్, తమన్నాలా అనుష్క కూడా వరుస ఆఫర్లతో బిజీగా ఉండేవాళ్లని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus