Allu Arjun: సినిమా విడుదలై ఆరు నెలలైనా తగ్గని పుష్ప క్రేజ్!

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం పుష్ప. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో గత ఏడాది డిసెంబర్ 17 వ తేదీ విడుదల అయి బాక్సాఫీసు వద్ద ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఇండస్ట్రీలో ఈ సినిమా విపరీతమైన క్రేజ్ ఏర్పరుచుకుందని చెప్పాలి.

ఇండస్ట్రీలో ఏ విధమైనటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ఊహించిన విధంగా వంద కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టడమేకాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ మార్కెట్ అమాంతం పెంచేసింది. ఇకపోతే అల్లు అర్జున్ నటించిన ఈ సినిమాలో డైలాగులు పాటలు ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే ఎంతోమంది ఈ సినిమాలో డైలాగులు చెబుతూ, పాటలకు రీల్స్ చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

సాధారణ అభిమానుల నుంచి సెలబ్రిటీల వరకు రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఇలా ఈ సినిమా విడుదల అయ్యి దాదాపు ఆరు నెలలు కావస్తున్నా ఇప్పటికీ ఈ సినిమా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని చెప్పాలి. బహుశా ఒక సినిమా విడుదలై ఆరు నెలలు అయినా కూడా ట్రెండింగ్ లో ఉన్న సినిమా పుష్ప సినిమా అనే చెప్పాలి. తాజాగా ఈ సినిమాలో అల్లు అర్జున్ రష్మిక గెటప్స్ తో కూడిన షర్ట్స్ మార్కెట్లో విడుదలయ్యాయి.ఈ క్రమంలోనే ఎంతోమంది అభిమానులు పుష్ప షర్ట్స్ ధరించి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఈ సినిమాకు ఇంకా ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదని తెలుస్తోంది.ఇలా పుష్ప సినిమా ద్వారా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన అల్లు అర్జున్ తదుపరి పుష్ప 2 సినిమా ద్వారా ఎలాంటి రికార్డులు సృష్టిస్తారో అని ప్రతి ఒక్క అభిమాని ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ మరి కాస్త ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus