అసలు వైకుంఠపురము ఇల్లు ఇదే..!

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలయికలో విడుదలైన మూవీ అల వైకుంఠపురములో. బాక్సాఫీసు వద్ద సంక్రాంతి విన్నర్ అనిపించుకొని భారీ వసూళ్ల దిశగా బన్నీ దూసుకెళ్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. అల వైకుంఠపురములో కనిపించే ఇంటి గుట్టు బయటపడింది. అత్తారింటికి దారేది చిత్రం కోసం రామోజీఫిల్మ్ సిటిలో ఓ విలాావంతమైన ఇంటి సెట్ వేయించిన త్రివిక్రమ్ … అల వైకుంఠపురానికి మాత్రం రియల్ ఇంట్లోనే షూట్ చేశారు. Ntv ఛానెల్ అధినేత కుమార్తె అయిన రచన చౌదరి కి హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో నగరంలోనే అత్యంత ఖరీదైన నివాసం ఉంది. సుమారు రూ. 300 కోట్ల విలువచేసే ఆ ఇల్లు అత్యంత విలాసంగా ఉంటుంది. ఎంతలా అంటే ఆ ఇంటి గార్డెన్ లో పూసే పూలకు కూడా పేటెంట్ ఉంది. ఇటలీ నుంచి తెప్పించిన విలువైన మొక్కలు ఆ ఇంట్లో ఉన్నాయి.

ఓ సారి ఆ ఇంటిని అనుకోకుండా చూసిన త్రివిక్రమ్ … తన కథకు సరిగ్గా సరిపోయే ఇల్లు దొరికిందని సంతోషించారు. వెంటనే యజమానులతో మాట్లాడగానే… అడిగింది మాటల మాంత్రికుడు కదా అని అంగీకరించారు. ఇప్పుడు ఆ ఇల్లు వైకుంఠపురముగా మారి సినిమాలో కీలకంగా నిలిచింది. సుమారు 20 రోజుల పాటు ఆ ఇంట్లో సినిమా షూట్ చేశారు. అయితే ఆ ఇంటిని చూసిన బన్నీకి కూడా విలాసవంతమైన ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇంటికి సంబంధించిన పలు విషయాలను యజమానులను అడిగి తెలుసుకున్నాడు. అదే స్థాయిలో బంజారాహిల్స్ లో ఇంటిని నిర్మించుకోబోతున్నాడు అల్లు అర్జున్ . ఈ మేరకు తన కొత్తింటి విషయాన్ని ఇటీవల అల వైకుంఠపురము థ్యాంక్స్ మీట్ లో వెల్లడించిన బన్నీ… ఆ ఇంటి నిర్మాణానికి నిర్మాత, తన తండ్రి అల్లు అరవింద్ ను డబ్బులు అడుగుతానని చెప్పడం విశేషం. అయితే బన్నీ కట్టుకోబోయే ఆ ఇల్లు ఎలా ఉంటుందో, ఆ ఇంటికి ఏం పేరు పెడతాడో చూడాలి. మొత్తానికి త్రివిక్రమ్ బన్నీకి సూపర్ హిట్ ఇవ్వడమే కాకుండా ఓ ఇంటి వాణ్ని చేస్తుండటం మరో విశేషం.

Click Here To Ala Vaikunthapurramloo Movie Review

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus