జనాలు అనుకుంటున్నారని నిజం చేశారేమో అనిపిస్తుంది

బాలీవుడ్ లో దీపిక పదుకొనె స్టార్ డమ్ గురించి ప్రత్యేకముగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే నటిగా ఆమె ప్రతిభకు కొలమానం లేదని చెప్పాలి. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీల భన్సాలీ తెరకెక్కించిన రామ్ లీల, భాజీ రావ్ మస్తానీ మరియు పద్మావత్ వంటి భారీ చిత్రాలలో అధ్బుతమైన పాత్రలు ఆమె దక్కించుకుంది. మరి అలాంటి నటి ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ పక్కన అంటే…ఆ కాంబినేషన్ కి ఉండే క్రేజ్ ఊహించడం కష్టమే.

దానికి తోడు టాలీవుడ్ కి దీపికా ఈ చిత్రంతో అడుగు పెడుతుంది. స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తరువాత దీపిక సౌత్ వైపు చూడలేదు. రజిని కాంత్ నటించిన యానిమేటెడ్ మూవీ కొచ్చడయాన్ లో మాత్రం నటించింది. తరువాత ప్రభాస్ కోసమే ఆమె సౌత్ లో అడుగుపెట్టనున్నారు. కాగా ప్రభాస్ 21 మూవీలో దీపికా పదుకొనె నటిస్తున్నట్లు చాలా రోజులుగా వార్తలు రావడం జరిగింది. ఓ సంధర్భంలో దర్శకుడు నాగ్ అశ్విన్ ని అడుగగా అందులో ఎంటువంటి నిజం లేదు అన్నారు.

అలాగే ఆ విషయం మాకు గానీ, ఆమెకు కానీ తెలియదంటూ చమత్కరించారు. తీరా దీపికా పదుకొనె హీరోయిన్ గా చేస్తున్నట్లు ప్రకటించారు. దీనితో జనాల్లో దీపికా పేరు బాగా వెళ్ళిపోయిన పక్షంలో ఆమెను తీసుకోవడమే బెటర్ అని నిర్మాతలు భావించారా అనే అనుమానం కలుగుతుంది. రెండు నెలలుగా నలుగుతున్న వార్తల నేపథ్యంలో ప్రభాస్ కి జంటగా దీపికా బాగుంటుందని, ప్రేక్షకులు కోరుకుంటున్నారని, కొంచెం బడ్జెట్ ఎక్కువైనా తీసుకున్నారనే టాక్ వినిపిస్తుంది.

Most Recommended Video

చిరంజీవి, బాలకృష్ణలు తలపడిన 15 సందర్భాలు!
తమ ఫ్యామిలీస్ తో సీరియల్ ఆర్టిస్ట్ ల.. రేర్ అండ్ అన్ సీన్ పిక్స్..!
ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్లను రాబట్టిన తెలుగు సినిమాలు ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus