భార్య స్పూర్తితో పాత్రను డిజైన్ చేసిన కొరటాల!

మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ చిత్రాలు తీసి హ్యాట్రిక్ అందుకున్న డైరక్టర్ కొరటాల శివ. అతని దర్శకత్వంలో తెరకెక్కిన మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ సినిమాలు భారీ విజయాన్ని సాధించాయి. ఇప్పుడు నాలుగో సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు తో తీయడానికి సిద్ధమయిపోయారు. ఇప్పటికే కథ చెప్పి ఒకే చేయించుకున్న కొరటాల  స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నారు. ఈ కథలో మహేష్ పోషించ బోయే పాత్ర రూపకల్పనకు డైరక్టర్ భార్య అరవింద స్ఫూర్తి అని తెలిసింది.

లండన్లో చదువుకున్నా అరవింద, కొరటాల శివను ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. ఆమె రామకృష్ణ పరమహంసను ఫాలో అవుతారు.  సింప్లిసిటీ అంటే ఇష్టం. జీవించడానికి అవసరమైన డబ్బును ఉంచుకొని తమ ఆస్తినంతా సొసైటీకి తిరిగిచ్చేయాలనే ఆలోచన ఆమెది. ఆ ఆలోచనే  శివకి శ్రీమంతుడు కథ సిద్ధం చేయడానికి దోహదం చేసిందంట. అలాగే అరవింద వ్యక్తిగత జీవితం ప్రభావంతో మహేష్ కొత్త కథను రాసారని సమాచారం.

అరవింద తనని తాను ప్రేమించుకునే తీరుకి ముచ్చటపడి అదే అలవాటు హీరోకి ఉంటే ఎలా ఉంటుందోనని భావించి “లవ్ యువర్ సెల్ఫ్” అనే థీమ్ తో కొత్త కథ మలిచారని తెలిసింది. మనల్ని మనం ఎంతగా ప్రేమించుకుంటామో  దానిని బట్టే  ఇతరులను ప్రేమించే స్థాయి ఆధారపడి ఉంటుందని అరవింద విశ్వాసం. ఆమె నమ్మకం ఎంతమంది మనసులను గెలుచుకుంటుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus