ఎన్టీఆర్-త్రివిక్రమ్ టైటిల్ ప్రకటనకు అడ్డొచ్చిన సెంటిమెంట్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసహం పీక్స్ లో ఉంది. ఎన్టీఆర్ నుండి వారు ఆశిస్తున్న అప్డేట్స్ అన్ని ఆగిపోవడమే ఇందుకు కారణం. ఆర్ ఆర్ ఆర్ ఫస్ట్ లుక్ వీడియో కోసం వేయికళ్లతో ఫ్యాన్స్ ఎదురు చూశారు. లాక్ డౌన్ వలన షూటింగ్ జరపలేమని, ఫస్ట్ లుక్ వీడియో కొరకు కావలసిన మెటీరియల్ లేదని రాజమౌళి ఫ్యాన్స్ ని నిరాశపరిచాడు. ఆర్ ఆర్ ఆర్ వలన ఎన్టీఆర్ రెండు ఏళ్ళు సినిమా విడుదల చేయలేకపోయాడని ఆవేదనలో ఉన్న ఫ్యాన్స్ కి ఇది మరింత ఇబ్బంది కలిగింది. ఆర్ ఆర్ ఆర్ లో మరో హీరోగా నటిస్తున్న చరణ్ ఫస్ట్ లుక్ వీడియో ఆయన పుట్టినరోజు కానుకగా రావడంతో పాటు, ఫ్యాన్స్ అంచనాలకు మించి ఉంది.

దీనితో ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో అంతకు మించి వుంటుందని భావిస్తున్నారు. కాగా ఆర్ ఆర్ ఆర్ చిత్రీకరణలో ఉండగానే ఎన్టీఆర్ తన 30వ చిత్రం త్రివిక్రంతో ప్రకటించారు. ఈ మూవీ షూట్ ఏప్రిల్ నుండే మొదలుకావాల్సి ఉంది. ఐతే లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. కాగా కనీసం ఎన్టీఆర్ 30పై అప్డేట్ ఇవ్వాలని, టైటిల్ ప్రకటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా అభ్యర్థనలు చేస్తున్నారు. ఎన్టీఆర్ 30 చిత్ర నిర్మాతలలో ఒకరిగా ఉన్న సూర్య దేవర నాగవంశీ సోషల్ మీడియా ద్వారా దీనిపై స్పందించడం జరిగింది.

తమకున్న సెంటిమెంట్ ప్రకారం మూవీ షూటింగ్ మొదలుకాకుండా టైటిల్ ప్రకటించలేమని, షూటింగ్ మొదలైన వెంటనే టైటిల్ ప్రకటిస్తాం అన్నారు. అప్పటి వరకు ఫ్యాన్స్ సంయమనం పాటించాలని అన్నారు. అధికారికంగా ప్రకటించక పోయినప్పటికీ అయిననూ పోయిరావలె హస్తినకు అనే టైటిల్ ప్రచారంలో ఉంది.

Most Recommended Video

34 ఏళ్ళ సినీ కెరీర్ లో ‘కింగ్’ నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
సౌత్ లో అత్యధిక పారితోకం అందుకునే సంగీత దర్శకులు వీరే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus