ముక్కు అవినాష్.. ‘బిగ్ బాస్4’ ఎంట్రీ వెనుక చాలా కథ నడిచిందిగా…!

రెండు రోజుల క్రితం ‘బిగ్ బాస్4’ కు వైల్డ్ కార్డు ద్వారా కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు ముక్కు అవినాష్. నిజానికి ఈ వారంలో ఇది రెండో వైల్డ్ కార్డు ఎంట్రీ. ముందుగా కుమార్ సాయి అనే కమెడియన్ కూడా వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. ఇదిలా ఉండగా.. ఇప్పటి వరకూ ఏ కంటెస్టెంట్ కూడా ముక్కు అవినాష్ రేంజ్లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వలేదని చెప్పొచ్చు. నిజానికి ‘బిగ్ బాస్4’ ప్రారంభంకాబోతుంది అని ప్రచారం మొదలైనప్పటి నుండీ ముక్కు అవినాష్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇస్తాడు అంటూ వార్తలు వచ్చాయి. అయితే మొదటిరోజు అతను లిస్ట్ లో లేకపోవడంతో ‘అదంతా ఫేక్ న్యూస్’ ఏమో అని జనాలు ఫిక్స్ అయిపోయారు.

అయితే అవినాష్ ‘బిగ్ బాస్4’ ఎంట్రీ ఇవ్వడానికి చాలా కష్టాలు పడ్డాడట. అదేంటంటే.. ‘జబర్దస్త్’ లో సక్సెస్ ఫుల్ కమెడియన్ గా రాణిస్తున్న ముక్కు అవినాష్.. ఆ షో యాజమాన్యాన్ని మేనేజ్ చేసి ‘బిగ్ బాస్’ షో కు ఎంట్రీ ఇచ్చాడట. నిజానికి ‘జబర్దస్త్’ షోలో పాల్గొనే నటీనటులందరితో ‘మల్లెమాల’ వారు బాండ్ రాయించుకుంటారట. అది బ్రేక్ చేసి వేరే షోకి వెళ్లాలంటే ఫైన్ కట్టి వెళ్ళాలట. దీంతో ముక్కు అవినాష్ వారితో భేరాలు ఆడటానికి ఎక్కువ టైం పట్టినట్టు తెలుస్తుంది.

ఫైనల్ గా 10 లక్షలు ఫైన్ కట్టి.. ‘బిగ్ బాస్4’ కు ఎంట్రీ ఇచ్చాడట అవినాష్. ‘బిగ్ బాస్4’ కు గాను అవినాష్ కు వారానికి 5లక్షల వరకూ పారితోషికం అందుతుందట. షోలో కనుక అతను 10వారాల పాటు కొనసాగితే కనుక అవినాష్ కు 50 లక్షలు వరకూ దక్కుతుంది. ఒకవేళ వెంటనే ఎలిమినేట్ అయిపోతే కనుక.. తిరిగి ‘జబర్దస్త్’ కు వెళ్లి తన ప్రయాణాన్ని కొనసాగించుకోవచ్చు. ఎలాగూ ముక్కు అవినాష్ కు శ్రీముఖి, విష్ణుప్రియ వంటి స్టార్ యాంకర్ల సప్పోర్ట్ ఉంది కాబట్టి .. ‘బిగ్ బాస్4’ లో అతను ఎక్కువ రోజులు కొనసాగే అవకాశం ఉందనే టాక్ కూడా బలంగా వినిపిస్తుంది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus