పవన్ కళ్యాణ్ కోసం కథ సిద్ధంగా ఉందన్న హరీష్ శంకర్
- June 23, 2017 / 06:31 AM ISTByFilmy Focus
‘కట్టెకాలేవరకు నేను పవన్ కళ్యాణ్ అభిమానిని’ అంటూ దర్శకుడు హరీష్ శంకర్ దువ్వాడ జగన్నాథం సినిమా ఆడియో ఫంక్షన్ లో చెప్పి తనపై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టారు. వరుస అపజయాలతో సతమవుతున్న పవన్ కళ్యాణ్ కి హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ ద్వారా సూపర్ హిట్ ఇచ్చారు. ఆ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన సర్ధార్ గబ్బర్ సింగ్ కి డైరక్టర్ గా అవకాశం ఇవ్వక పోవడంతో.. వారిద్దరీ మధ్య దూరం పెరిగిందని వార్తలు చక్కర్లు కొట్టాయి. వాటిని ఒక్క మాటతో తిప్పికొట్టారు. తాజాగా డీజే సినిమా ప్రమోషన్లో భాగంగా మాట్లాడుతూ ఆసక్తికర విషయం చెప్పారు. ” నేను పవన్ కళ్యాణ్ గారిని కలిసి 4 నెలలు కావోస్తోంది. ఆయన కోసం నా దగ్గర ఎప్పుడూ ఒక స్క్రిప్ట్ రెడీగానే ఉంటుంది.
ఆయన ఒప్పుకుంటే ఎప్పుడైనా చెప్తాను.” అని పవన్ తో సినిమా చేయడానికి తాను రెడీగా ఉన్నట్లు వెల్లడించారు. అంతేకాదు చిరంజీవితోను సినిమా తీయాలని ఉందనే కోరికను బయట పెట్టారు. “చిరంజీవిగారితో దొంగ మొగుడు, రౌడీ ఇన్స్పెక్టర్ లాంటి సినిమా చేయాలనుంది. ఏదో ఒక రోజు తప్పకుండా చేస్తాను” అని పూర్తి విశ్వాసంతో చెప్పారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో హరీష్ శంకర్ తెరకెక్కించిన డీజే ఈ రోజు భారీ అంచనాలతో రిలీజ్ అవుతోంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















