Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

సినిమా షూటింగ్‌ టైమ్‌లోనే, కొన్ని రోజులు అయ్యాకనో సినిమా కథ లైన్‌ లేదా కాన్సెప్ట్‌ను రివీల్‌ చేసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో హిట్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) కూడా ఉన్నారు. ఆయన సినిమా పోస్టర్‌ ద్వారా కూడా కథ లైన్‌ను చెప్పేస్తుంటారు. లేదంటే కనీసం ఓ పాట ద్వారా అయినా సినిమా పాయింట్‌ చెప్పేస్తారయన. ఇప్పుడు ఆయన సినిమా షూటింగ్‌ ప్రారంభంలోనే అంటే ముహూర్తపు షాట్‌ సమయంలోనే సినిమా కథ లైన్‌ను చెప్పేశారా? చూస్తుంటే అవుననే అనిపిస్తోంది.

Anil Ravipudi

వెంకటేశ్‌ – కల్యాణ్‌ రామ్‌ హీరోలుగా అనిల్‌ రావిపూడి ఓ సినిమాను కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. కీర్తి సురేశ్‌ – కృతి శెట్టి ఈ సినిమాలో కథానాయికలుగా నటిస్తున్నారు అని గత కొన్ని రోజులుగా వార్తలొచ్చాయి. ఇప్పుడు ఆ సినిమా ముహూర్తం కార్యక్రమం నిర్వహించారు. దీంతో హీరోయిన్లు వారే అని తేలిపోయింది. అంతేకాదు సినిమా లైన్‌ కూడా దాదాపుగా తెలిసిపోయింది. సినిమా ముహూర్తం కార్యక్రమాన్ని పూర్తిగా కాకపోయినా ప్రారంభంలో చూసినా విషయం అర్థమైపోతుంది.

నాయకానాయికలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ క్లాప్‌నివ్వగా, నిర్మాత డి.సురేశ్‌బాబు కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. లెజెండరీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. చిత్రబృందానికి నిర్మాతలు దిల్‌ రాజు, శిరీష్‌ స్క్రిప్ట్‌ అందజేశారు. ఇదంతా జరిగే ముందు వెంకటేశ్‌ పక్కన కృతి శెట్టి నిలబడగా.. కల్యాణ్‌ రామ్‌ పక్కన కీర్తి సురేశ్‌ నిలబడ్డారు. కానీ ఆ తర్వాత నాలుక కరుచుకొని ఎవరి ప్లేస్‌లోకి వారు వెళ్లారు.

ఇదంతా, పొరపాటున జరిగింది కాదని తెలుస్తోంది. సినిమా కథలో మెయిన్‌లైన్‌ ఈ కన్‌ఫ్యూజనే అని తెలుస్తోంది. రెండు కపుల్స్‌ మధ్య జరిగే కన్‌ఫ్యూజన్‌ ఆధారంగా స్టోరీ నడుస్తుందట. ఈ విషయంలో తెలియాలంటే వచ్చే సంక్రాంతి రావాల్సిందే. ఎందుకంటే ఈ సినిమా అప్పుడే విడుదల. అయిత అంతవరకు ఆగకుండా సినిమా టీజర్‌లోనో లేక ట్రైలర్‌లోనో తెలిసిపోయే ఛాన్స్‌ కూడా ఉంది.

Peddi Collections: 2వ వారం కూడా ఓకే అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు.. కానీ?

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus