ఆస్కార్‌లు రావడానికి కారణమిదే… సినిమా కథ మామూలుగా ఉండదు!

ఆస్కార్‌ అవార్డు ఏ సినిమాకు వస్తుంది అంటూ కొన్ని నెలలపాటు చర్చ జరుగుతుంది. రకరకాల అంచనాలు, లెక్కలు వేస్తూ ఉంటారు సినిమా ప్రేక్షకులు. అలా గతేడాది నామినేషన్లు ప్రకటించినప్పటి నుండి లెక్కలేస్తూనే ఉన్నారు. వాటిని మరోసారి నిజం చేస్తూ ‘అనోరా’ (Anora) సినిమా ఆస్కార్‌ ఉత్తమ చిత్రంగా నిలిచింది. పోటీలో ఉన్న మిగిలిన చిత్రాలతో పోలిస్తే తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఐదు విభాగాల్లో అవార్డులు అందుకుంది. మరి ఈ సినిమా కథేంటో తెలుసా?

Anora

భారీతనం డామినేట్‌ చేసే హాలీవుడ్‌లో మనసుల్ని బరువెక్కించే కథతో తెరకెక్కిన సినిమా ‘అనోరా’ (Anora). ‘రెడ్‌ రాకెట్‌’, ‘ది ఫ్లోరిడా ప్రాజెక్ట్‌’ తదితర మనసులు మెచ్చిన చిత్రాలను తెరకెక్కించిన సీన్‌ బేకర్‌ ఈ సినిమాను రూపొందించారు. రొమాంటిక్‌ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమా 23 ఏళ్ల వేశ్య చుట్టూ తిరుగుతుంది. బ్రూక్లిన్‌లో ఉంటే అని తన వృత్తిలో భాగంగా ఓసారి రష్యాకు చెందిన ధనవంతుడి కుమారుడు అయిన వన్యను కలుస్తుంది.

తొలిసారి కలిసినప్పుడు అనిపై ప్రేమను పెంచుకున్న వన్య రహస్యంగా వివాహం చేసుకుంటాడు. ఈ ఘటన పెద్ద చర్చకు దారితీస్తుంది. రష్యాలో ఉంటున్న వన్య తల్లిదండ్రులకు ఈ విషయం తెలుస్తుంది. వాళ్లేమో తమ తనయుడు అమాయకుడని, మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నావంటూ అనిని నిందిస్తారు. అక్కడితో ఆగకుండా తమ కొడుకుని వదిలేస్తే 10 వేల డాలర్లు ఇస్తామని ఆశ కూడా చూపిస్తారు. ఆ ఆఫర్‌కి అని ఓకే చెప్పిందా?

ఈ ఘటన తర్వాత ఆమె జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనే కథతో ఈ సినిమా రూపొందింది. ఇంత చెప్పాక సినిమా వసూళ్లు చెప్పకపోతే ఎలా.. అందుకే ఆ విషయం గురించి కూడా ఓసారి చూద్దాం. మన కరెన్సీ ప్రకారం సుమారు రూ.52 కోట్లతో రూపొందిన ఈ సినిమా సుమారు రూ.358 కోట్లు అందుకుంది. ఇక ఈ సినిమాను అమెజాన్‌ ప్రైమ్‌, యాపిల్‌ టీవీ ప్లస్‌లో చూడొచ్చు. అయితే సబ్‌స్క్రిప్షన్‌కి రెంట్‌ అదనం.

తమ్ముడి బంధంపై మంచు లక్ష్మీ ఎమోషనల్ రియాక్షన్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus