ఒక పేరు, రెండు డైలాగ్‌లు… ‘బ్రో’ సినిమా వచ్చాక వీటితో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఓ మంత్రిని ఉద్దేశిస్తూ పాత్ర ఉందని, ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ డైలాగ్‌లు ఉన్నాయని పెద్ద ఎత్తున మాటల తూటాలు పేలాయి. ఆ సినిమాకు ప్రోమోలు, టీజర్లు, పోస్టర్లతో ఎంత ప్రచారం జరిగిందో తెలియదు కానీ.. ‘శ్యాంబాబు వర్సెస్ రాంబాబు’ అనే కాన్సెప్ట్‌తో భారీగానే ప్రచారం వచ్చింది. అయితే ఇదంతా ఓ డైలాగ్‌లు, ఓ పాత్రకు మాత్రమే. అలాంటి సినిమాలో ఇలాంటి పంచ్‌లు, పాత్రలు బోలెడు ఉంటే.. ఇక రచ్చ రంబోలానే.
పవన్ చేస్తున్న తదుపరి సినిమాల్లో ఓ సినిమా ఇలానే ఉంటుంది అని అంటున్నారు. ఆ సినిమా నేపథ్యంలో పొలిటికల్ పంచ్‌లకు కావాల్సినంత స్కోప్ ఉందని చెబుతున్నారు. సినిమాలో డైలాగ్‌లు బలంగా ఉంటాయని కూడా చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో పొటిటికల్ ఊచకోత తప్పనిసరి అంటున్నారు. వచ్చే ఎన్నికలను లక్ష్యంగా చేసుకునే ఈ సినిమాను వేగంగా పూర్తి చేసి, రిలీజ్ చేస్తారని కూడా చెబుతున్నారు.
హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం (Ustaad Bhagat Singh) ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమాలో పొలిటికల్ సెటైర్లు, పంచులు ఉంటాయని గత రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని చెబుతూ… ఓ ట్వీట్ పడగా.. దానికి డైరెక్టరే స్పందిస్తూ కచ్చితంగా ఉంటాయి అని అన్నారు. ‘ఖుషి’ సినిమాలో పవన్ కాలర్ రుద్దుకునే ఇమేజ్ ట్వీట్ చేస్తూ ఆన్సర్ కూడా ఇచ్చారు. దీంతో డైలాగ్‌లు పక్కా అని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. అయితే ఎలాంటివి అనేది చూడాలి. వ్యంగ్యంగా, అందులో పొలిటికల్ టచ్ ఉన్న సంభాషణలు రాయడంలో హరీష్ శంకర్ దిట్ట అంటుంటారు.
అది సెటైర్ అని ఎదుటి వ్యక్తికి అర్థం అయ్యేలోపే మరో సెటైర్ పడేలా ఆయన రాయగలరు అంటుంటారు. ఆ మధ్య ట్విటర్‌లో తన స్నేహితుడితో పొటిలికల్ టచ్ ట్వీట్ వార్ కూడా జరిగింది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో పవన్ కల్యాణ్ పోలీసుగా నటిస్తున్నాడు. ఈ సినిమా మాతృక ‘తెరి’ని గమనిస్తే అందులో ఓ ఎంపీని విలన్ పాత్రలో చూపించారు. ఎంపీకి ఎదురు తిరిగి హీరోయిజం చూపించే సీన్లు చాలానే ఉన్నాయి. ఇది చాలు కదా సినిమాలో పొలిటికల్ పంచ్‌లు ఎలా పడతాయో చెప్పడానికి.
ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!