Peter Hein: ఫైట్స్‌లో స్టారే… మరి హీరోగా ఏ మేరకు రాణిస్తారో? ఎవరంటే?

పీటర్‌ హెయిన్‌… ఈ పేరు మనకు సుపరిచితమే. 23 ఏళ్లుగా భారతీయ సినిమాల్లో యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ అదరగొట్టేస్తున్నారు. ఎంతమంది కొత్త యాక్షన్‌ కొరియోగ్రాఫర్లు వస్తున్నా ఆయన మాత్రం తనదైన శైలిలో యాక్షన్‌ కొరియోగ్రఫీతో వావ్‌ అనిపిస్తున్నారు. అయితే ఆయన ఇప్పుడు హీరోగా ఓ సినిమా చేస్తారు అని సమాచారం. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయని టాలీవుడ్ వర్గాల టాక్‌.

రిస్కీ ఫైట్ సీక్వెన్స్ అంటే ఇప్పుడు చాలామంది యాక్షన్‌ కొరియోగ్రాఫర్ల పేర్లు వినిపిస్తున్నాయి కానీ… కొన్నేళ్ల క్రితం పీటర్‌ హెయిన్‌ పేరు దగ్గర మొదలయ్యే చర్చ ఆయన దగ్గర పూర్తయ్యేది. అంతలా తన ప్రతిభతో ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఓ పాన్ ఇండియా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారని టాక్. తమిళంలో ప్రాథమికంగా రూపొందనున్న ఈ సినిమాను ట్రెండ్స్ సినిమాస్, ఎండి సినిమాస్ నిర్మిస్తాయట. అయితే ఈ సినిమాకు దర్శకుడు ఎవరు అనేది తెలియాల్సి ఉంది.

ఇప్పటికే ఫైట్‌ మాస్టర్స్‌ ద్వయం అన్బు – అరివ్ హీరోలుగా మారుతున్నారు. తెలుగులో రామ్‌ – లక్ష్మణ్‌ మాస్టర్‌లు ఇప్పటికే హీరోగా చేసి ఆపేశారు. వీరి తర్వాత పీటర్‌ హెయిన్‌ వస్తున్నారన్నమాట. నిజానికి పీటర్‌ మల్టీటాలెంటెడ్‌. యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌గా చేస్తూనే కొన్ని సినిమాల్లో నటించారు కూడా. అంతేకాదు ఓ సినిమాకు దర్శకత్వం కూడా వహించారు. 2022లో ‘సామ్‌ హొయ్‌’ అనే వియత్నాం సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే ఆ సినిమాకు దారుణ పరాజయం ఎదురైంది.

ఇక పీటర్‌ హెయిన్‌ కెరీర్ గురించి చూస్తే… 1992లో ‘కావ్య తలైవన్‌’ అనే సినిమాతో ఎక్స్‌ట్రా ఫైటర్‌గా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత 9 ఏళ్లకు ‘మిన్నలే’ / ‘చెలి’ సినిమాతో యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌గా మారారు. తెలుగులో ఆయన తొలి సినిమా ‘మురారి’. అక్కడి నుండి వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో సినిమాలు చేశారు. నటుడిగా ఓ ఆరు సినిమాల్లో నటించారు.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus