Su From So Review in Telugu: సు ఫ్రమ్ సో సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • షానీల్ గౌతమ్ (Hero)
  • సంధ్య (Heroine)
  • జె.పి.తుమినాడ్, రాజ్ బి.శెట్టి, ప్రకాష్ తుమినాడ్, దీపక్ రాజ్ (Cast)
  • జె.పి.తుమినాడ్ (Director)
  • శశిధర్ శెట్టి బరోడా - రవి రాయ్ కలస - రాజ్ బి.శెట్టి (Producer)
  • సుమేద్ - సందీప్ తులసీదాస్ (Music)
  • ఎస్.చంద్రశేఖరన్ (Cinematography)
  • నితిన్ శెట్టి (Editor)
  • Release Date : ఆగస్ట్ 08, 2025
  • లైటర్ బుద్ధ ఫిలింస్ (Banner)

గత కొంతకాలంగా సరైన హిట్ లేక ఢీలాపడిన కన్నడ చిత్రసీమకు ఊపిరి పోసిన చిత్రం “సు ఫ్రమ్ సో”. రాజ్ బి.శెట్టి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన ఈ చిత్రానికి తుమినాడ్ దర్శకత్వం వహించాడు. కర్ణాటకలో కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల్ని అనువాద రూపంలో పలకరించనుంది. ఈ హారర్ కామెడీ తెలుగు ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకోగలుగుతుందో చూద్దాం..!!

Su from So Movie Review

కథ:
దక్షిణ కర్ణాటకకు చెందిన ఓ చిన్న ఊర్లో ప్రజలందరూ చాలా సంతోషంగా గడిపేస్తుంటారు. ఊరి పెద్ద లాంటి రవన్న (షానీల్ గౌతమ్) తనకు తెలిసిన పూజలు చేస్తూ ఊరి ప్రజలకు కష్టం కలగకుండా చూసుకుంటూ ఉంటాడు. అదే ఊర్లో ఉండే పెయింటింగ్ పని చేసుకునే అశోక్ (జె.పి.తుమినాడ్) తొందరపడి చేసిన ఒక తప్పును కవర్ చేయడం కోసం మరో తప్పు చేస్తాడు. దాని కారణంగా ఊర్లో పెద్ద రచ్చ మొదలవుతుంది.
దాంతో స్వామి (రాజ్ బి శెట్టి) కథలోకి ఎంటర్ అవుతాడు.
అసలు అశోక్ క్రియేట్ చేసిన డేంజర్ ఏమిటి? దాని వల్ల ఎవరెవరు ఎఫెక్ట్ అయ్యారు? స్వామి, రవన్న, అశోక్ కలిసి ఆ సమస్యకు ఎలాంటి పరిష్కారం అందించారు? వంటి ప్రశ్నలకు సమాధానమే “సు ఫ్రమ్ సో” కథాంశం.

నటీనటుల పనితీరు:
షానీల్ గౌతమ్ పోషించిన రవన్న పాత్ర సినిమాకి హైలైట్ గా నిలిచింది. కామెడీతోపాటు ఎమోషన్ కూడా చాలా చక్కగా పండించాడు. ముఖ్యంగా అశోక్ పాత్రతో చెంపదెబ్బలు తినే సన్నివేశం, తాగేసి స్కూటర్ పార్క్ చేసే సీన్ భలే పేలతాయి.
అదే తరహాలో దర్శకుడు తుమినాడ్ కూడా చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు. నిజానికి సినిమాలో కీలకపాత్ర ఇతనిదే. చాలా ఆండర్ ప్లే చేశాడు. అలాగే.. కీలకమైన సన్నివేశాల్లో మంచి మెచ్యూరిటీ కనబరిచాడు.
వీళ్లిద్దరి తర్వాత ఆకట్టుకున్న నటుడు రాజ్ బి.శెట్టి. దొంగ స్వామిగా అట్టై హావభావాలు, బాడీ లాంగ్వేజ్ హిలేరియస్ గా పేలాయి. ముఖ్యంగా దెయ్యం అనుకుని పరిగెత్తే సీన్ భలే పేలింది.
ఇక గ్రామస్థుల పాత్రల్లో నటించిన ప్రకాష్ తుమినాడ్, దీపక్ లు భలే నవ్వించారు. వీళ్లందరికీ మించి సంధ్య పాత్ర చాన్నాళ్లు గుర్తుండిపోతుంది. ఆమె పాత్రతో మంచి మెసేజ్ ఇచ్చారు.

సాంకేతికవర్గం పనితీరు:
టెక్నికల్ గా కొన్ని లోటుపాట్లు ఉన్నప్పటికీ.. కథనం, కామెడీ సీన్లు విశేషంగా ఆకట్టుకోవడంతో ఆ టెక్నికల్ మైనస్ పాయింట్స్ ను ఖాతరు చేయాల్సిన అవసరం పడలేదు. కామెడీ సినిమా అయినప్పటికీ.. సమాజంలోని లోటుపాట్లు, మనుషుల్లోని చెడు ఆలోచనలు ఒక మహిళ జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి? అనే అంశాన్ని ప్రస్తావించిన విధానం బాగుంది. రైటింగ్ విషయంలో చాలా మంచి ఆలోచనలు ఉన్నాయి తుమినాడ్ కి. అవన్నీ తెరపై చాలా సింపుల్ గా ఎలివేట్ అయ్యాయి. దర్శకుడిగా, రచయితగా, నటుడిగా తుమినాడ్ అత్యద్భుతంగా ఆకట్టుకున్నాడనే చెప్పాలి. హారర్ కామెడీ జోనర్ ని ఈస్థాయిలో లారెన్స్ తర్వాత పండించిన దర్శకుడు తుమినాడ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరీ ముఖ్యంగా భాను పాత్ర మనుషులతో కంటే దెయ్యంతోనే సంతోషంగా ఉండగలిగింది అనే విషయాన్ని అంతర్లీనంగా అర్థమయ్యేలా చేసిన విధానం హృదయానికి హత్తుకుంటుంది.
సినిమాటోగ్రఫీ, సంగీతం, ఎడిటింగ్ వంటి అంశాలన్నీ బాగున్నాయి. డబ్బింగ్ క్వాలిటీ కూడా బాగుంది. అందువల్ల థియేటరికల్ ఎక్స్ పీరియన్స్ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా “బావ వచ్చాడు” బీజియం భలే ఆకట్టుకుంటుంది.

విశ్లేషణ:
హారర్ సినిమాలతో నవ్వించడం అనేది చాలామంది చేశారు కానీ.. నవ్వించి, ఆ తర్వాత ఎమోషనల్ కనెక్ట్ తో అలరించడం అనేది చాలా అరుదుగా జరిగే విషయం. “సు ఫ్రమ్ సో”లో అదే జరిగింది. చాలా సెన్సిబుల్ గా డీల్ చేయడంతో మంచి సినిమా చూశామన్న సంతృప్తితోపాటు ఆరోగ్యకరమైన కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది.

ఫోకస్ పాయింట్: సిల్లీ & సెన్సిబుల్ ఎంటర్టైనర్!

రేటింగ్: 3/5

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus