Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!
- July 22, 2026 / 11:04 AM ISTByPhani Kumar
సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై కామెంట్లు చేయడం అనేది సర్వసాధారణమైన విషయం. వాళ్ళ వ్యక్తిగత విషయాలపై మాత్రమే కాదు ఫిజికల్ గా కూడా వాళ్ళని టార్గెట్ చేస్తూ… హద్దులు మీరి కామెంట్లు చేయడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. కొంతమంది సెలబ్రిటీలు ఇలాంటి వాటిని పట్టించుకోరు, లైట్ తీసుకుంటారు. మరికొంతమంది మాత్రం ఘాటుగా స్పందిస్తారు. ఇప్పుడు ఇలాంటి వ్యవహారం గురించే మనం మాట్లాడుకోబోతున్నాం.
Subhashree
విషయంలోకి వెళితే.. ‘బిగ్‌బాస్’ ఫేమ్ శుభశ్రీ రాయగురు(Subhashree) ఓ నెటిజెన్ కామెంట్స్ పై స్పందించిన తీరు సంచలనమైంది.బిగ్‌బాస్ 7వ సీజన్ ద్వారా శుభ శ్రీకి మంచి పాపులారిటీ లభించింది. ఒడియా అమ్మాయి అయినప్పటికీ తెలుగు జనాలు ఆమెను బాగా ఓన్ చేసుకున్నారు. వృత్తిరీత్యా ఆమె లాయర్ అనే సంగతి కూడా అందరికీ తెలిసిందే. కానీ నటనపై ఉన్న ఆసక్తితో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. సినిమాల్లో అనుకున్నంత సక్సెస్ రాలేదు.

స్మాల్ స్క్రీన్ పై మాత్రం మంచి ఫాలోయింగ్ పొందింది. తర్వాత ఆస్ట్రేలియాలో నివసించే అజయ్ అనే భారతీయుడిని ప్రేమించి గతేడాది జూన్‌లో వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత ఆమె సోషల్ మీడియాకు గ్యాప్ ఇచ్చింది. కానీ కొద్దిరోజుల నుండీ ఆమె మళ్లీ యాక్టివ్ అయ్యింది. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంది. అయితే లేటెస్ట్ ఫొటోల్లో ఆమె కాస్త బొద్దుగా కనిపించడంతో ఓ నెటిజెన్ ఆమెను ‘నువ్వు ప్రెగ్నెంటా?’ అంటూ కామెంట్స్ చేశారు.
దీంతో శుభశ్రీ వారిపై ఫైర్ అవుతూ ఒక వీడియో చేసింది. “నన్ను పదే పదే ప్రెగ్నెంటా అని అడుగుతున్నావు.. ఇంతకీ నీ సంగతి ఏంటి? నువ్వు సింగిల్ ఆ? ఓహో సింగిల్ అంటే బాయ్ ఫ్రెండ్ వదిలేశాడా? ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావ్. పీజీ(PG) లో ఉంటున్నావా? అంటే మీ అమ్మ, నాన్న కూడా వదిలేశారా? అయితే ఇప్పుడు నీకు జాబ్ అవసరం” అంటూ తెలివిగా సెటైర్లు విసిరింది. ఆమె వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.














