మెగాహీరో అరుదైన రికార్డ్!

మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలు ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో కుర్రహీరో సాయి ధరమ్ తేజ్ ఒకరు. కమర్షియల్ ఫార్మాట్ లో ఉన్న కథలను ఎన్నుకుంటూ.. అందులో కొత్తదనం ఉండేలా చూసుకుంటున్నాడు ఈ సుప్రీం హీరో. ‘పిల్లా నువ్వు లేని జీవితం’,’సుబ్రమణ్యం ఫర్ సేల్’,’సుప్రీం’ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడు.

అయితే ఈ మెగాహీరో యూట్యూబ్ లో అరుదైన రికార్డ్ సంపాదించుకున్నాడు. తను నటించిన ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమా యూట్యూబ్ లో చూసిన వారి సంఖ్య 50 లక్షలు దాటేసింది. ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా.. దిల్ రాజు నిర్మించారు. కేవలం నాలుగు సినిమాలు మాత్రమే చేసిన సాయి ధరమ్ తేజ్ కు ఇలాంటి ఘనత దక్కడం అరుదనే చెప్పాలి.

ఇది వరకు మెగా ఫ్యామిలీలో హీరోరామ్ చరణ్ నటించిన ‘ఎవడు’ సినిమా యూట్యూబ్ లో కోటి వ్యూస్ ని దాటి టాప్ ప్లేస్ లో ఉంది. మరి తేజు ఆ నెంబర్ ను క్రాస్ చేస్తాడో లేదో చూడాలి. ఇది ఇలా ఉండగా సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం బి.వి.ఎస్.రవి దర్శకత్వంలో ‘తిక్క’ అనే సినిమాలో నటిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలియాల్సివుంది!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus