కన్నడంలో…బాహుబలిని మించిన సినిమా!!!

  • August 19, 2016 / 07:00 AM IST

తెలుగు చలనచిత్ర కీర్తిని ప్రపంచ వ్యాప్తం చేసిన ఘనుడు మన జక్కన్న రాజమౌళి. తాను తీసిన  బాహుబలి ఇప్పటికీ సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా, ఎన్నో అవార్డులను, రివార్డులను తెచ్చిపెట్టింది. ఆస్కార్ రేంజ్ మూవీ కావడంతో ఈ సినిమా రెండు భాగం కోసం ఎదురుచూస్తున్నారు మన తెలుగు ప్రేక్షకులు…ఇదిలా ఉంటే రాజమౌళి తీసిన బాహుబలి స్పూర్తితో ఒక్కసారిగా మిగిలిన పరిశ్రమల్లో కదలిక వచ్చింది. ఆయా ఇండస్ట్రీల దర్శక నిర్మాతల్లోనూ ఆలోచన రేకెత్తించింది. అదే క్రమంలో శేఖర్ కపూర్ లాంటి లెజెండరీ డైరెక్టర్ సైతం ‘బాహుబలి’ని చూసి ఇన్ స్పైర్ అయిపోయారు.

బాలీవుడ్ దర్శకులు రాజమౌళిని చూసి నేర్చుకోవాలన్నారు. ఇండియాలో ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలన్నారు. ఆల్రెడీ తమిళ దర్శకుడు సుందర్ ‘బాహుబలి’ని చూసి స్ఫూర్తి పొందాడు. బాహుబలి తరహాలోనే భారీ పీరియాడ్రికల్ డ్రామాను తెరకెక్కించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక కన్నడ విషయానికి వస్తే ఇలాంటి సినిమాను కన్నడంలో చేస్తాను అంటున్నాడు మన కిచ్చా సుధీప్. ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయిన సుదీప్, ఇప్పటికే…దర్శకుడు గా.. విక్రమార్కుడు.. మిర్చి లాంటి సినిమాల్ని స్వీయ దర్శకత్వంలో రీమేక్ చేశాడు. కొన్ని డైరెక్ట్ సినిమాలు కూడా తీశాడు.

ఇప్పుడు బాహుబలి తరహాలో భారీ సినిమాను రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. అయితే ఈ సినిమాను కేవలం కన్నడంలో మాత్రమే కాకుండా తమిళంలో కూడా భారీ పీరియాడికల్ యాక్షన్ సినిమాగా తెరకెక్కిస్తానని చెబుతున్నాడు…వచ్చే ఏడాది ఈ సినిమాని తీస్తాను అంటున్నాడు…చూడాలి అంతటి భారీ బడ్జెట్ తో కూడిన సినిమా ఎలా వర్కౌట్ అవుతుందో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus