వజ్ర శ్రీ ఫిలింస్ బ్యానర్ పై సుధాకర్ కోమకుల హీరోగా ‘పంటపండింది’ చిత్రం ప్రారంభం

లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ ఫేమ్ సుధాకర్ కోమకుల, కోమలి హీరో హీరోయిన్లుగా వజ్ర శ్రీ ఫిలింస్ బ్యానర్ పై నూతన చిత్రం ‘పంట పండింది’ ఏప్రిల్ 21న పశ్చిమ గోదావరి జిల్లా జక్కనపేట ముత్యాలమ్మవారి దేవస్థానంలో ప్రారంభమైంది. గురుశ్రీ(సుబ్బు) దర్శకత్వంలో శ్రీనివాసరావు మరిడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తొలి సన్నివేశానికి వెస్ట్ గోదావరి జెడ్.పి.ఛైర్మన్ గొల్లపూడి బాపిరాజు క్లాప్ కొట్టగా , తాడెపల్లి గూడెం మున్సిపల్ ఛైర్మన్ పొలిశెట్టి శ్రీనివాస్, వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ కెమెరా స్విచ్చాన్ చేశారు. కొవ్వూరు డి.ఎస్.పి చెర్ర వెంకటేశ్వరరావు , శ్రీ చక్ర గిరిధర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా..

చిత్ర నిర్మాత శ్రీనివాసరావు మరిడి మాట్లాడుతూ ‘’లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సుధాకర్ కోమకుల ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. దర్శకుడు గురుశ్రీగారు చెప్పిన కథ బాగా నచ్చంది. అందరి హృదయాలను స్పృశించే ప్రేమకథా చిత్రం. పల్లెటూర్లో ఉంటూ నాలుగు ఉత్తమ రైతుగా జాతీయ అవార్డు గెలుచుకున్న హీరో, హైదరాబాద్ హైటెక్ సిటీలో సాఫ్ట్ వేర్ జాబ్ చేసే హీరోయిన్ మధ్య ప్రేమ ఎలా పుట్టిందనేది కథాంశం. మే మూడో వారం నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ ను జరుపుకుంటుంది. సినిమాను రెండు షెడ్యూల్స్ లో పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తాం. అందులో భాగంగా మొదటి షెడ్యూల్ ను హైదరాబాద్ లో, రెండో షెడ్యూల్ ను రాజోలు, పట్టిసీమల్లో చిత్రీకరిస్తాం‘‘ అన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus