‘వి’లోకి నేనొచ్చేసరికి రాక్షసుడు ఉన్నాడు!: సుధీర్ బాబు

‘వి’ టీమ్ విడుదల చేసిన సుధీర్ బాబు పోస్టర్ చూస్తే కండలు తిరిగిన దేహంతో కనిపించారు. ప్యాక్డ్ బాడీ చూపించారు. హీరో ఇంట్రడక్షన్ ఫైట్‌లో ఆయన బాడీని చూపించనున్నారు. అయితే, దీని కోసం దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి ఆయనకు కొన్ని సూచనలు ఇచ్చారట. “ఫైట్‌లో బాడీ చూపించే విషయంలో ఇంద్రగంటిగారు ఓ మాట అన్నారు. నువ్వు చొక్కా తీస్తేనే కండలు కనిపించాలి. చొక్కా వేసుకున్నప్పుడు కండలు ఉన్న విషయం తెలియకూడదని చెప్పారు. నేను ఏదైనా రిఫరెన్స్ అడిగితే ‘ఫైటర్ క్లబ్’లో బ్రాడ్ పిట్ టైప్ కావాలన్నారు. నేను అలా ట్రై చేశా” అని సుధీర్ బాబు మీడియాతో నిర్వహించిన జూమ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో అన్నారు.

‘వి’లో సుధీర్ బాబు హీరోగా నటించగా, నాని విలన్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. రాక్షసుడు, రక్షకుడు మధ్య జరిగే పోరాటమే సినిమా అని సుధీర్ బాబు అన్నారు. కథ చెప్పినప్పుడు రెండు పాత్రలో ఏది నచ్చిందని అడగ్గా “వి’లోకి నేనొచ్చేసరికి రాక్షసుడు ఉన్నారు. రక్షకుడు పాత్ర కోసమే నన్ను సంప్రదించారు. ఒకవేళ ముందే కథ చెప్పినా రక్షకుడు పాత్ర సెలెక్ట్ చేసుకునేవాడిని. నాకు పోలీస్ పాత్ర నచ్చింది. నాకు అది కొత్తగా ఉంటుంది” అని అన్నారు. ప్రేక్షకుల ఊహలకు అతీతంగా సినిమా ఉంటుందని ఆయన అన్నారు.

లాక్‌డౌన్‌లో రెండు రోజులకు ఒక కథ విన్నట్టు విన్నానని సుధీర్ బాబు అన్నారు. అందులో రెండు కథలు ఓకే చేశానని తెలిపారు. ప్రొడక్షన్ హౌస్‌లు మూడు నాలుగు రోజుల్లో అనౌన్స్ చేస్తారని చెప్పారు. పాన్ ఇండియన్ రేంజ్ లో పుల్లెల గోపీచంద్ బయోపిక్ చేయాలని ప్లాన్ చేశామన్నారు. కొన్ని కారణాల వల్ల ఆలస్యమైందని, డిసెంబర్ నెలలో షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నట్టు సుధీర్ బాబు తెలిపారు.

Most Recommended Video

34 ఏళ్ళ సినీ కెరీర్ లో ‘కింగ్’ నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
సౌత్ లో అత్యధిక పారితోకం అందుకునే సంగీత దర్శకులు వీరే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus