నిర్మాతతో గొడవపడి ప్రొజెక్ట్ నుంచి తప్పుకొన్న సుధీర్ బాబు

మొన్నామధ్య సుధీర్ బాబు షూటింగ్ అనంతరం అవుట్ పుట్ నచ్చకపోవడంతో “వీరభోగ వసంతరాయులు” అనే సినిమాకు డబ్బింగ్ చెప్పకుండా తప్పించుకొన్న విషయం తెలిసిందే. ఆ సినిమా డిజాస్టర్ అయిన విషయం పక్కన పెడితే.. సుధీర్ బాబు డబ్బింగ్ చెప్పకపోవడంతో సినిమాలో అన్నీ క్యారెక్టర్స్ కంటే ఎక్కువగా కనిపించే, వినిపించే ఆ పాత్ర చూస్తున్నంతసేపు ఏదో డబ్బింగ్ సినిమా చూస్తున్న అనుభూతికి లోనయ్యారు ప్రేక్షకులు. ఆ సినిమా కోసం జరిగిన రచ్చ ఇంకా పూర్తవ్వకముందే.. ఇప్పుడు మరోసారి నిర్మాతలతో సుధీర్ బాబు గొడవపడిన విషయం బయటకి వచ్చింది.

ఇటీవల సుధీర్ బాబు-మెహ్రీన్ జంటగా వాసు పులి అనే యువకుడి దర్శకత్వంలో ఒక సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఆ సినిమా నిర్మాత రిజ్వాన్ తో వచ్చిన గొడవ కారణంగా సుధీర్ బాబు ఆ సినిమా నుంచి తప్పుకొన్నాడట. దాంతో ఆ సినిమా ఆగిపోయిందని ఫిలిమ్ నగర్ వర్గాల టాక్. మరి సుధీర్ బాబు తదుపరి సినిమా ఏమిటనే విషయంలో క్లారిటీ రావాలంటే కొన్నాళ్లపాటు ఆగాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus