త్వరలో ప్రారంభం కానున్న సుధీర్ బాబు డ్రీమ్ ప్రాజెక్ట్..?

ఇటీవలే విడుదలైన బాఘీ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినప్పటికీ.. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ లో విలన్ గా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. తాజా సమాచారం ప్రకారం బాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపిచంద్ జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనుండగా..

ఇందులో సుధీర్ బాబు నటించనున్నాడు. స్వతహాగా బాడ్మింటన్ ఆటగాడు అయిన సుధీర్ బాబు.. గోపిచంద్ జీవిత చరిత్రలో నటించడం తన డ్రీమ్ ప్రాజెక్టు అని గతంలో వెల్లడించాడు. జాతీయ అవార్డు గ్రహీత ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం .. జులై నుంచి సెట్స్ పైకి వెళ్లనుందని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus