బుల్లితెర షోలు, ఈవెంట్ల ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న కమెడియన్లలో సుడిగాలి సుధీర్ ఒకరు. సాఫ్ట్ వేర్ సుధీర్ అనే సినిమాతో సుడిగాలి సుధీర్ హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకోగా ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. ఒకవైపు ఎక్స్ట్రా జబర్దస్త్ షోలో స్కిట్లు చేస్తూనే సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు చేయడం ద్వారా సుధీర్ పాపులారిటీని అంతకంతకూ పెంచుకుంటున్నారు. ఈవెంట్లలో కూడా పాల్గొంటూ సుధీర్ తన ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. అయితే తాజాగా ఒక షోలో సుడిగాలి సుధీర్ తొలిసారి తన ఆస్తులపై నోరు విప్పారు.
తనకు హైదరాబాద్ లో రెండు సొంతిళ్లు ఉన్నాయని సుధీర్ చెప్పుకొచ్చారు. స్థిరాస్థులను కూడా బాగానే కూడబెట్టుకున్నానని సుధీర్ వెల్లడించారు. ప్రస్తుత కాలంలో నగరాల్లో ఒక ఇంటిని కొనుగోలు చేయాలంటే కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. సుధీర్ మాత్రం రెండు ఇల్లులు కొనుగోలు చేశాడంటే భారీ మొత్తంలో సంపాదిస్తున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఒకప్పుడు ఎన్నో కష్టాలు పడిన సుధీర్ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటూ తన టాలెంట్ తో ఎదిగారు.
సుధీర్ కెరీర్ విషయంలో మరింత సక్సెస్ కావాలని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు. టాలెంట్ ఉంటే ఆలస్యంగానైనా సక్సెస్ ను సొంతం చేసుకోవచ్చని చెప్పడానికి సుధీర్ ఉదాహరణ అని చెప్పవచ్చు. హీరోగా సుధీర్ నటించే సినిమాలు హిట్ అయితే భవిష్యత్తులో సుధీర్ మూవీ ఆఫర్లతో మరింత బిజీ అయ్యే అవకాశం ఉంటుంది. రష్మీ సుధీర్ గురించి వస్తున్న వార్తల వల్ల కూడా సుధీర్ కు క్రేజ్ పెరుగుతోంది.
Most Recommended Video
చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!