Sudigali Sudheer: నా సంతోషం నా బలం వాళ్ళే వైరల్ అవుతున్న సుధీర్ పోస్ట్!

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సుడిగాలి సుదీర్ ఒకరు. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా విపరీతమైన ఫాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సుదీర్ జబర్దస్త్ కార్యక్రమానికి దూరమయ్యారు. సుధీర్ ఈ కార్యక్రమానికి దూరం కావడానికి కారణం తెలియకపోయినప్పటికీ సుధీర్ జబర్దస్త్ కార్యక్రమానికి దూరం కావడంతో ఎంతోమంది అభిమానులు జబర్దస్త్ కార్యక్రమంలో సుధీర్ ను మిస్ అవుతున్నారు. ఇక సుధీర్ తో పాటు ఆయన టీంలో గెటప్ శ్రీను కూడా బయటకు వెళ్లిపోవడంతో కేవలం ఆటో రాంప్రసాద్ మాత్రమే జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలలో స్కిట్లు చేస్తూ ప్రేక్షకులను సందడి చేశారు.

ఇకపోతే మల్లెమాలతో గొడవల కారణంగా వెళ్లిపోయారని, సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ ముగ్గురి మధ్య మనస్పర్ధలు రావడం చేత ముగ్గురు విడిపోయారని వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ విషయాలపై సుడిగాలి సుదీర్ స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే సుధీర్ ఆటో రాంప్రసాద్ గెటప్ శ్రీను తో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేస్తూ వీళ్లే నా బలం, వీళ్లే నా సంతోషం..

వీళ్లే నా చిలిపితనం అంటూ పోస్ట్ చేశారు. మేం ఎక్కడ ఉన్నా ఎంత దూరం ఉన్నా మా మధ్య బంధం ముగిసిపోదు అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ఇకపోతే జబర్దస్త్ కార్యక్రమం నుంచి ఒక్కొక్కరిగా బయటకు వెళ్లడంతో కార్యక్రమా రేటింగ్స్ పూర్తిగా పడిపోవడంతో నిర్వాహకులు తిరిగి వీరందరిని ఈ కార్యక్రమానికి తీసుకొస్తున్నారు.

ఇప్పటికే గెటప్ శీను రీ ఎంట్రీ ఇవ్వగా త్వరలోనే సుడిగాలి సుదీర్ వస్తారని అందరూ భావించారు. అయితే సుధీర్ ప్రస్తుతం ఎక్కడ ఉన్న మా బంధం ముగియదు అంటూ పోస్ట్ చేయడంతో ఈ కార్యక్రమానికి బహుశా తిరిగి రాకపోవచ్చు ఏమోనని పలువురు భావిస్తున్నారు.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus