Suhas Remuneration: సుహాస్ రెమ్యునరేషన్ భారీగా పెరిగిందా.. ఆయన ఏమన్నారంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంట్ తో గుర్తింపును సొంతం చేసుకున్నహీరోలలో (Suhas) సుహాస్ ఒకరు. సుహాస్ సినిమా అంటే కొత్తగా ఉంటుందని అభిమానులు సైతం ఫీలవుతారనే సంగతి తెలిసిందే. అయితే సుహాస్ రెమ్యునరేషన్ గురించి సోషల్ మీడియాలో వేర్వేరు రూమర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. ఆ రూమర్ల గురించి సుహాస్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రసన్నవదనం మూవీ వినోదభరితంగా ఉంటుందని సినిమాలో ఎమోషన్స్ కూడా ఉంటాయని కామెంట్స్ చేశారు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ తో (Ambajipeta Marriage Band) అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ తర్వాత ఈ సినిమాను ఎంచుకోవడం జరిగిందని సుహాస్ వెల్లడించారు.

ఈ సినిమాలో థ్రిల్ కూడా ఉంటుందని ఆయన తెలిపారు. రెమ్యునరేషన్ 3 కోట్ల రూపాయలకు పెంచారట కదా అనే ప్రశ్నకు సుహాస్ స్పందిస్తూ నేను కూడా బ్రతకాలి కదా అని సరదాగా అన్నారు. జూనియర్ ఆర్టిస్ట్ దగ్గరి నుంచి ఈ స్థాయికి వచ్చానని ఆయన తెలిపారు. అప్పట్లో రోజుకు 100 రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నానని సుహాస్ అభిప్రాయపడ్డారు. ఆ రెమ్యునరేషన్ తో పోల్చి చూస్తే మార్పు రావాలని ఆయన అన్నారు.

రెమ్యునరేషన్ పెంచాను కానీ మరీ మీరు అనుకున్న స్థాయిలో పెంచలేదని సుహాస్ పేర్కొన్నారు. మొదటి సినిమాను ప్రేమించినట్లు తర్వాత సినిమాను ప్రేమించరని ఆయన కామెంట్లు చేశారు. నేను ఏది చేయాలన్నా భయపడనని సుహాస్ వెల్లడించారు. ప్రసన్నవదనం సినిమాలో స్టైలిష్ గా కనిపిస్తానని ఆయన అన్నారు. కొత్త హీరోలకు ఏమైనా మెసేజ్ ఇస్తారా అనే ప్రశ్నకు నా బ్రతుకేంటో నాకు అర్థం కావడం లేదని సుహాస్ పేర్కొన్నారు.

ఏడాదికి రెండు సినిమాలు చేస్తానని ప్రేక్షకులు తిట్టుకోని కథలను ఎంచుకుంటానని సుహాస్ వెల్లడించారు. సుహాస్ చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రసన్నవదనం టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తుండగా ఈ సినిమాతో సుహాస్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.

ఇంటర్వ్యూ : ‘గామి’గురించి డైరెక్టర్ విద్యాధర్ కాగిత చెప్పిన ఆసక్తికర విషయాలు.!

ఇంటర్వ్యూ : ‘భీమా’ గురించి గోపీచంద్ చెప్పిన ఆసక్తికర విషయాలు
రోడ్డుపై యాంకర్ ఝాన్సీ చెత్త సేకరించడానికి కారణాలివేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus