Suhas: తండ్రైన సుహాస్ .. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

  • January 23, 2024 / 03:53 PM IST

ప్రాణ ప్రతిష్ట రోజు ప్రముఖ నటుడు, కథానాయకుడు అయిన సుహాస్‌ తండ్రయ్యాడు. సుహాస్‌ భార్య లలిత పండంటి మగబిడ్డకు జన్మనివ్వడం జరిగింది. దీంతో అతని ఫ్యామిలీ మొత్తం ఆనందంలో మునిగిపోయింది అనే చెప్పాలి. స్వయంగా సుహాస్‌ ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించాడు. సుహాస్ తన ఇన్స్టాగ్రామ్లో.. “మగబిడ్డ.. ప్రొడక్షన్‌ నెంబర్‌ 1’’ అంటూ తన మార్క్ కామెడీ టైమింగ్ తో చెప్పుకొచ్చాడు. అలాగే తన బిడ్డను చేతుల్లోకి తీసుకుని మురిసిపోతున్న ఫోటోని కూడా షేర్ చేశాడు.

దీంతో అతని ఫాలోవర్స్ అంతా ‘కంగ్రాట్స్’ చెబుతూ తమ బెస్ట్ విషెస్ ను తెలియజేశారు. దీంతో సుహాస్ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. పలు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరీర్ ను మొదలుపెట్టిన సుహాస్.. అటు తర్వాత సినిమాల్లో ఛాన్సులు దక్కించుకున్నాడు.’ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ ‘మజిలీ’ ‘ప్రతిరోజూ పండగే’ ‘డియర్ కామ్రేడ్’ ‘పడి పడి లేచే మనసు’ వంటి సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు. అతని క్రేజ్ కూడా పెరిగింది.

అందుకే అతనికి (Suhas) హీరో ఛాన్సులు కూడా లభించాయి అని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో చేసిన ‘కలర్ ఫోటో’ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత ‘రైటర్ పద్మభూషణ్’ సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక సుహాస్ హీరోగా నటించిన మరో సినిమా ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ రిలీజ్ కి రెడీగా ఉంది.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags