Suhas: ‘అంబాజీపేట…’లో కులాల ప్రస్తావన… అయితే అలా ఉండదంటూ..!

  • January 25, 2024 / 12:57 PM IST

మనం చాలా రోజులుగా అనుకుంటున్న విషయమే సినిమాలు – మనోభావాలు. కొన్ని సినిమాలు ఎంత ప్రయత్నం చేసినా ఆ మనోభావాల ఇబ్బంది నుండి బయటపడలేదు. ఇప్పుడు ఈ విషయం గురించి ఎందుకు చర్చ అంటే… మరో సినిమా దాదాపు ఇలాంటి పరిస్థితే వస్తుందేమో అనే చర్చ రావడమే. అయితే సినిమా టీమ్‌ ఇప్పటికే ఈ విషయంలో స్పందించి క్లారిటీ ఇచ్చేసింది కూడా. అయితే ఎంతవరకు ఆ క్లారిటీ ఉపయోపగపడుతుంది అనేది చూడాలి.

సోషల్‌ మీడియా మంచి నటుడిగ పేరు తెచ్చుకున్న సుహాస్‌… సినిమాల్లోనూ మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. నేషనల్‌ అవార్డు సినిమాల్లో నటించాడు కూడా. అయితే ఇప్పుడు తన కెరీర్‌లోనే ప్రత్యేకమైన చిత్రం అంటూ ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ అనే సినిమా చేశాడు. ఈ సినిమా చూస్తున్నప్పుడు చాలా సార్లు మీ జీవితంలో జరిగిన కొన్ని సందర్భాల్ని గుర్తు చేసుకుంటారు అని అంటున్నాడు సుహాస్‌. ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమాను ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

ఈ నేపథ్యంలో సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు దుశ్యంత్‌ మాట్లాడుతూ యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందించామని, ఇందులో ప్రేమకథతో పాటు ఇంటెన్స్‌ డ్రామా కూడా ఉంటుంది అని చెప్పారు. ఒక ఊరిలో జరిగే కథ కాబట్టి కులాల ప్రస్తావన ఉంటుంది అని చెప్పారాయన. అయితే ఎవరినీ కించపరిచే అంశాలు ఉండవు అని చెప్పారు. దీంతో దర్శకుడు ముందే ఇలా అన్నారంటే సినిమాలో ఏ అంశాలు చర్చించారో అనే చర్చ మొదలైంది.

మరోవైపు ఈ సినిమా (Suhas) శిరోమండనం అనే అంశం నేపథ్యంలో సాగుతుంది అని ఇప్పటికే వార్తలొచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా కోసం రెండు సార్లు గుండు కొట్టించుకున్నా అని సుహాస్‌ కూడా చెప్పాడు. ఈ నేపథ్యంలో సినిమా కథేంటి, ఆ కులాల ప్రస్తావనేంటి అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ‘అన్నపూరణి’ సినిమా విషయంలో సౌత్‌ సినిమా ఇబ్బందిపడింది. అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ విడుదలై మంచి ఆదరణ పొందాలని కోరుకుందాం.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus