సాహో తనకి ఎంత విలువైందో చెప్పిన డైరక్టర్ సుజీత్!

రన్ రాజా రన్.. ఈ ఒకే ఒక హిట్ తో ప్రభాస్ తో సినిమా చేసే ఛాన్స్ అందుకున్నారు యువ డైరక్టర్ సుజీత్. అయితే బాహుబలి సినిమా షూటింగ్ సమయం పెరగడంతో వెంటనే సుజీత్ తో సినిమా మొదలెట్టే వీలు ప్రభాస్ కి కుదరలేదు. సుజీత్ ప్రభాస్ డేట్స్ కోసం ఏ సినిమాని ఒప్పుకోకుండా రెండేళ్లు ఎదురుచూసారు. బాహుబలి చిత్రాలతో ప్రభాస్ రేంజ్ పెరిగినప్పటికీ ముందు ఇచ్చిన మాట ప్రకారం సుజీత్ తో సాహో మొదలెట్టారు. ఏకకాలంలో మూడు భాషల్లో తెరకెక్కుస్తోన్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకొని .. రెండు షెడ్యూల్ కి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సుజిత్ మాట్లాడుతూ “లార్జర్ దన్ లైఫ్ కాన్వాస్ లో తెరకెక్కుతున్న భారీ సినిమా సాహో. అందుకే ఒకేసారి పది సినిమాలకు పని చేస్తున్న ఫీలింగ్ కలుగుతోంది.

ప్రస్తుతం నా దృష్టి అంతా ఈ సినిమాపైనే ఉంది. అందుకే దీని తర్వాత ఏ సినిమా చేయాలనే ఆలోచన కూడా రావట్లేదు” అని సాహో తనకి ఎంత ప్రత్యేకమైందో చెప్పారు. యువీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ లు 150కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ నటిస్తోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus