పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న ఓజీ (OG Movie) సినిమాపై ఇప్పటికే క్రేజ్ తారాస్థాయిలో ఉంది. సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో వస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌కి సంబంధించి రిలీజ్ చేసిన గ్లింప్స్ సినిమాపై అంచనాలు మరింత పెంచేశాయి. పవన్ లుక్, స్టైలిష్ ప్రెజెన్స్ చూసిన ఫ్యాన్స్ ఇప్పటికీ ఉత్కంఠగా మిగతా టీజర్స్, ట్రైలర్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో ఓ క్రేజీ టెక్నాలజీ అప్‌డేట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. లేటెస్ట్ సమాచారం ప్రకారం, సుజీత్ ఓజీ సినిమా కోసం పవన్ కళ్యాణ్‌ను మళ్లీ యంగ్ లుక్‌లో చూపించేందుకు కృత్రిమ మేధస్సు (AI) సాయాన్ని తీసుకుంటున్నాడట.
అంటే ఈ సినిమాలో 30 ఏళ్ల వయసున్న పవన్ లుక్‌ను VFX, AI టెక్నాలజీల మిళితంతో తెరపై మళ్లీ చూపించబోతున్నారన్న మాట. ఇది తెలుగు పరిశ్రమలో ఈ స్థాయిలో మొదటిసారి జరిగే ప్రయోగం కావడం విశేషం. ఫ్యాన్స్ ఎప్పటి నుంచో తమ్ముడు, ఖుషి తరహాలో పవన్‌ను మళ్లీ తెరపై చూడాలని కోరుకుంటున్నారు. ఈ కోణంలో సుజీత్ ప్రయత్నం చేయడం ఫ్యాన్స్‌కి ఊపిరి అందించినట్లే.
ముఖ్యంగా ఒక మాస్ యాక్షన్ ఫైట్ సీన్‌ను పూర్తిగా యంగ్ పవన్‌లా చూపించేందుకు స్క్రిప్ట్‌లో ముందుగానే ప్లాన్ చేశారట. AI ద్వారా పవన్ ముఖంలోని మార్పులను రీఎలిస్టిక్‌గా డిజైన్ చేయాలని టెక్నికల్ టీమ్ సీరియస్‌గా పని చేస్తోంది. ఇప్పటికే థమన్ సంగీతం, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో ఓజీ సినిమాకు టెక్నికల్‌గా బలమైన బేస్ తయారవుతోంది.
మిగతా వీఎఫ్ఎక్స్, డబ్బింగ్, సెట్ వర్క్ లాంటి అంశాలు కూడా శరవేగంగా పూర్తవుతున్నాయట. ఫైనల్ షెడ్యూల్ అనంతరం మరోసారి పవన్ మాస్ టీజర్‌తో ప్రేక్షకుల ముందుకు రావాలని టీమ్ సిద్ధమవుతోంది. మొత్తానికి పవన్‌కు AI టెక్నాలజీ మళ్ళీ యంగ్ లుక్‌ను ఇచ్చినట్లయితే, అది సినిమా విజయానికి బిగ్ ప్లస్ అవుతుంది.