Sujeeth: ‘ఓజీ’ కోసం మరోసారి ఎడిట్‌ టేబుల్‌ దగ్గరకు సుజీత్‌.. నిజమేనా?

థియేటర్‌లో వేస్తున్న సినిమాకు ఓటీటీలో వచ్చే సినిమాకు ఇటీవల కాలంలో కొన్ని తేడాలు కనిపిస్తున్నాయి. నిడివి కారణంగా థియేటర్లలో వద్దనుకున్న సీన్లను ఓటీటీలో సినిమా వచ్చినప్పుడు యాడ్‌ చేస్తున్నారు. అందుకే హిట్‌ సినిమాలు థియేటర్ల నుండి ఓటీటీలోకి వస్తున్నాయి అనగానే.. అదనపు సన్నివేశాలను ఏం జోడిస్తారా అనే చర్చ మొదలవుతోంది. ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌ ‘ఓజీ’ సినిమా విషయంలోనూ అదే డిస్కషన్‌ మొదలైంది. అంతేకాదు ప్రస్తుతం దర్శకుడు సుజీత్‌ ఇదే పనిలో ఉన్నారు అని కూడా చెబుతున్నారు.

Sujeeth

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా రూపొందిన గ్యాంగ్ స్టర్ డ్రామా ‘ఓజీ’. సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుమారు రూ.300 కోట్ల వసూళ్లతో సినిమా బ్లాక్‌బస్టర్ ఫలితాన్ని అందుకుంది. త్వరలో ట్రిపుల్‌ సెంచరీ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేయబోతోంది. ప్రస్తుతం థియేట్రికల్ రన్ బాగున్నప్పటికీ.. సినిమా ఓటీటీకి ఇచ్చే విషయంలో గతంలో అనుకున్నట్టుగా ముందుకెళ్లాలని అనుకుంటున్నారట. అదే జరిగితే అక్టోబరు ఆఖరి వారంలో సినిమా ఓటీటీలోకి రావొచ్చని టాక్‌.

‘ఓజీ’ సినిమా డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అక్టోబరు ఆఖరి స్లాట్‌లో ఈ సినిమాను స్ట్రీమ్‌ చేద్దామని ముందుగానే చెప్పారట. ఈ క్రమంలో ఓ 20 నిమిషాల అదనపు కంటెంట్‌ సిద్ధం చేస్తున్నారట. అయితే ఇలా యాడ్‌ చేస్తే మరోసారి సెన్సార్‌ చేయాల్సి ఉంటుంది. మరి టీమ్‌ ఏం చేస్తుందో చూడాలి. ఒకవేళ ఫ్యాన్స్‌కి అదనపు హ్యాపీనెస్‌ ఇవ్వాలని సుజీత్‌ అనుకుంటే మరోసారి ఎడిట్‌ టేబుల్‌ దగ్గర కూర్చోవాల్సి వస్తుంది.

సినిమా కథ విషయానికొస్తే.. ముంబయి కొలాబా పోర్టు సత్య దాదా (ప్రకాష్ రాజ్) కనుసన్నల్లో ఉంటుంది. ఆ పోర్టుకు డ్రగ్స్‌తో ఉన్న ఓ కంటైనర్ రాగా సత్య దాదా కొడుకును ముఠా చంపేస్తుంది. దాని కోసం, సత్య దాదా స్థానాన్ని ఆక్రమించుకోవాలని మిరాజ్ కర్ (తేజ్ సప్రూ) పెద్ద కొడుకు ఓమీ (ఇమ్రాన్‌ హస్మీ) రంగంలోకి దిగుతాడు. అప్పుడు సత్య దాదా కొడుకులా పెంచి పెద్ద చేసిన గంభీర (పవన్ కల్యాణ్) ముంబయిలోకి ఎంటర్‌ అవుతాడు. ఆ తర్వాత ఏమైంది అనేదే సినిమా.

నాని సినిమా నిర్మాతలు ఇలా మారిపోతున్నారేంటి? సమస్య ఎక్కడుంది?

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus