ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎదగాలి అంటే అంత సాధారణమైన విషయం కాదు. కేవలం టాలెంట్ ఒక్కటే సరిపోదు. ఎంతో కొంత సీనియర్ల సపోర్ట్ ఉండాల్సిందే. అగ్ర దర్శకులు చేయుతను అందిస్తే వారి వద్ద పనిచేసే శిష్యులు ఈజీగా సక్సెస్ కావచ్చని సుకుమార్ని రూపించాడు. ఉప్పెన సినిమాతో బుచ్చిబాబు ఏ స్థాయిలో క్రేజ్ అందుకున్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే బుచ్చిబాబు వెన్నంటే ఉన్న సుకుమార్ అంతకంటే ఎక్కువ గుర్తింపు అందుకున్నాడు.
శిష్యుల కోసమే సుక్కు.. సుకుమార్ రైటింగ్స్ స్థాపించి వారికొక దారిని చూపిస్తున్నారు. కుమారి 21F సినిమాతో సూర్య ప్రతాప్ కు ఛాన్స్ ఇచ్చిన సుక్కు అనంతరం దర్శకుడు సినిమాతో జక్కా హరిప్రసాద్ కు ఛాన్స్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు ఉప్పెన హిట్టవ్వడంతో మరికొందరు శిష్యులు కూడా దాదాపు అదే తరహాలో పవర్ఫుల్ కథలతో రెడీ ఆవుతున్నట్లు తెలుస్తోంది. సీనియర్ శిష్యుడు సూర్యప్రతాప్ 18 పేజెస్, అలాగే కార్తీక్ దండు అనే మరో శిష్యుడు సాయిధరమ్ తేజ్ తో ఒక బ్లాక్ మ్యాజిక్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేస్తున్నాడు.
అలాగే రమేష్ అనే మరో అసిస్టెంట్ ‘కప్పెల’ తెలుగు రీమేక్‌తో రాబోతున్నాడు. వీరితో పాటు మరో ఇద్దరు శిష్యులు కొన్ని డిఫరెంట్ కథలను రెడీ చేసుకున్నట్లు సమాచారం. ఈ దర్శకులంతా కూడా సుకుమార్ రైటింగ్స్ ద్వారానే ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇక వారికి సపోర్టింగ్ గా మైత్రి మూవీ మేకర్స్ కూడా ఉంది.
Most Recommended Video
పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!