‘పుష్ప’ (Pushpa) ప్రాజెక్టు మొదలైనప్పుడే సంగీత దర్శకుడిగా దేవి వద్దు తమన్ ని (S.S.Thaman) తీసుకుందామని హీరో అల్లు అర్జున్ (Allu Arjun) సుకుమార్ కి (Sukumar). సూచించడం జరిగింది. అందుకు సుక్కూ ఒప్పుకోలేదు. తన ఇన్పుట్స్ ని.. దేవి (Devi Sri Prasad) తప్ప ఇంకెవ్వరూ సరిగ్గా అర్థం చేసుకోలేరు అనేది సుకుమార్ నమ్మకం. అది ‘పుష్ప’ తో మరోసారి ప్రూవ్ చేశాడు దేవి. కానీ ‘పుష్ప 2’ విషయానికి వచ్చేసరికి బన్నీ.. మ్యూజిక్ విషయంలో పర్టిక్యులర్ గా మారాడు.
దీంతో నిర్మాతలు కూడా బన్నీకి నచ్చినట్టే చేయమని సుకుమార్ ని కోరడం జరిగింది. అందుకే దేవిని పక్కన పెట్టి అజనీష్ లోకనాథ్(B. Ajaneesh Loknath), తమన్, సామ్ సిఎస్ (Sam C. S)… వంటి వాళ్ళతో ‘పుష్ప 2’ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొట్టించడం జరిగింది. కానీ వాళ్ళు కొట్టింది సెకండ్ వర్షన్ అని ఇన్సైడ్ టాక్. విషయంలోకి వెళితే.. ‘పుష్ప 2’ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ ఆల్రెడీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చేశాడట. అయితే నిర్మాతలు, హీరో.. మాట కాదనలేక సెకండ్ వెర్షన్ కూడా కొట్టించడం జరిగింది.
ఫస్ట్ హాఫ్ కి తమన్ కొత్తగా సెకండాఫ్ కి సామ్ సి ఎస్, అజనీష్ లోకనాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా జాతర ఫైట్ కి అజనీష్ లోకనాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం జరిగింది అని టాక్. ట్రైలర్ విషయంలో కూడా 3,4 వెర్షన్స్ రెడీ అయ్యాయి. కానీ నిన్న వదిలింది దేవి బ్యాక్ గ్రౌండ్ ఇచ్చిన వెర్షన్ అని సమాచారం. సినిమా విషయంలో కూడా దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ ఇచ్చిన వెర్షన్ బయటకొస్తుందేమో చూడాలి.