Sukumar: ‘పుష్ప2’.. సుకుమార్ కి ‘నో’ రెమ్యునరేషన్!

టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నారు సుకుమార్. ‘పుష్ప’ సినిమా ఆయనకు పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ తీసుకొచ్చింది. ప్రస్తుతం ‘పుష్ప2’ కోసం సిద్ధమవుతున్నారు సుకుమార్. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తయింది. కొన్ని రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ బయటకొచ్చింది. అదేంటంటే.. ఈ సినిమాకి సుకుమార్ రెమ్యునరేషన్ తీసుకోవడం లేదట. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.

సాధారణంగా సుకుమార్ ఒక్కో సినిమాకి రూ.15 నుంచి రూ.20 కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకుంటారు. ‘పుష్ప’ తరువాత అతడి రేంజ్ పెరిగింది. ఆ సినిమాకి థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ బిజినెస్ కలిపి రూ.300 కోట్ల వరకు అయింది. ఆ లెక్కన చూసుకుంటే సుకుమార్ కి ఎలా లేదన్నా రూ.50 నుంచి రూ.70 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వాలి. ‘పుష్ప’ సినిమాకి అల్లు అర్జున్ రూ.50 కోట్లు తీసుకున్నారు. ఇప్పుడు సెకండ్ పార్ట్ కోసం రూ.100 కోట్లకు పైగా తీసుకుంటున్నారని టాక్.

దీంతో సుకుమార్ తన రెమ్యునరేషన్ కోసం ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. ముందుగా నిర్మాతల దగ్గర నుంచి పారితోషికం తీసుకోకుండా.. తన బ్యానర్ సుకుమార్ రైటింగ్స్ కు కో ప్రొడ్యూసర్ గా రంగంలోకి దింపారు. అంటే.. ‘పుష్ప2’ కోసం ఆయన రెమ్యునరేషన్ తీసుకోకుండా బిజినెస్ లో షేర్ తీసుకోబోతున్నారన్నమాట.

ఆ లెక్కన చూసుకుంటే ఆయనకు ఈజీగా రూ.70 నుంచి రూ.90 కోట్ల వరకు మిగిలే ఛాన్స్ ఉంది. నిజానికి ఈ సినిమాను అక్టోబర్ 2 నుంచి మొదలుపెట్టాలి కానీ దసరా తరువాత షూటింగ్ షురూ చేయాలని ఫిక్స్ అయ్యారు. ‘పుష్ప’లో కనిపించిన క్యారెక్టర్స్ అన్నీ పార్ట్ 2లో కనిపించబోతున్నాయి. ఇప్పటివరకు అయితే కొత్త క్యారెక్టర్స్ ను యాడ్ చేయలేదని సమాచారం.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus